twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్జున్‌కు 50 ప్రశ్నలు.. ఒంటిపై గిల్లి, కౌగిలించుకున్నది నిజం కాదా?

    |

    Recommended Video

    Cops Ask Arjun Sarja 50 Questions | Filmibeat Telugu

    సీనియర్ హీరో అర్జున్ కు మీటూ ఆరోపణల సమస్యలు ఎక్కువయ్యాయి. తనని వేధించాడంటూ నటి శృతి హరిహరన్ అర్జున్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పోలిసుల నుంచి అర్జున్ కు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో అర్జున్ ఇటీవల కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అర్జున్ కు పలు ప్రశ్నలు సంధించినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం నిజం కాదా

    ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం నిజం కాదా

    ప్రెసిడెన్సీ కాలేజీ ఆవరణలో జరిగిన షూటింగ్ లో నటి శృతి హరిహరన్ ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఒంటిపై గిల్లి, బలవంతంగా కౌగిలించుకున్నది నిజం కాదా అని పోలీసులు అర్జున్ ని ప్రశ్నించారు. ఆమెని తాను అసభ్యంగా తాకలేదు అని అర్జున్ పోలీసులకు సూటిగా సమాధానం ఇచ్చారు.

    ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెస్టారెంట్ కు రమ్మని

    ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెస్టారెంట్ కు రమ్మని

    బెంగుళూరులోని దేహనపల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శృతిని కలిసింది నిజం కాదా.. రెస్టారెంట్ లో సరదాగా గడుపుదాం రా అని బలవంత పెట్టింది నిజం కాదా.. రాకుంటే నీ కెరీర్ కు ఇబ్బందులు తప్పవు అనిబెదిరించింది వాస్తవం కాదా అంటూ అర్జున్ పై పోలీసులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధించారు. మీరడుగుతున్న ప్రశ్నల్లో ఒక్క విషయం కూడా జరగలేదని అర్జున్ సమాధానం ఇచ్చాడు.

    రూమ్‌కి రమ్మని పిలిచి

    రూమ్‌కి రమ్మని పిలిచి

    శృతి ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో రూమ్ కు రమ్మని బలవంత పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం అని ప్రశ్నించగా ఆరోణలని అర్జున్ ఖండించారు. అకారణంగా తనపై ఆమె నిందలు వేస్తోంది అంటూ బదులిచ్చారు.

     నేనేంటో వాళ్ళకి తెలుసు

    నేనేంటో వాళ్ళకి తెలుసు

    విచారణ పూర్తయిన తరువాత అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు కోర్టులో న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు అర్జున్ తెలిపారు. నేనేంటో న కుటుంబ సమానమైన అభిమానులకు తెలుసు అని అర్జున్ అన్నారు. అర్జున్ కూడా శృతి హరిహరన్ పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

    English summary
    MeToo: Cops ask Arjun Sarja 50 questions. Arjun Attends Police station for enquiry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X