నాకు లిప్ కిస్ పెట్టడానికి 19 సార్లు ట్రై చేశాడు.. అంత సిగ్గు ఎందుకో!
Recommended Video

2016 లో విడుదలైన మెట్రో చిత్రంతో యువ హీరో శిరీష్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో మంచి నటన కనబరిచాడు. ఇక తమిళం చక్కగా మాట్లాడగల నటి చాందిని వంజాగర్ ఉలగం చిత్రంతో గుర్తింపు పొందింది. నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం రాజా రంగుస్కి. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషనల్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ చిత్రాల్లో ఆసక్తిక్రమైన సంఘటనని చాందిని మీడియాతో పంచుకుంది.

ధరణి ధరన్ దర్శత్వంలో
రాజా రంగుస్కి చిత్రం ధరణి ధరన్ దర్శత్వంలో రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శిరీష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమంలో సన్నివేశం చోటు చేసుకుంది.

లిప్ లాక్ సీన్‌కు 19 టెక్స్
హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే టేక్ లో కంప్లీట్ అయ్యాయి. కానీ ఒక్క సన్నివేశానికి మాత్రం 19 టేక్స్ పట్టిందని చాందిని తెలిపింది. ఈ చిత్రంలో నాకు, శిరీష్ మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశానికే ఇన్ని టేక్స్ పట్టాయని చాందిని తెలిపింది.

అంత సిగ్గు ఎందుకో
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తాను మాత్రం ఫస్ట్ టేక్ లోనే పర్ఫెక్ట్ గా చేశానని చాందిని తెలిపింది. కానీ శిరీష్ కు చాలా సిగ్గు. అందుకే లిప్ లాక్ సీన్ చేయాడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేలకు 19 వ టేక్ లో బాగా చేశాడని చాందిని తెలిపింది.

యువన్ శంకర్ రాజా సంగీత దర్శత్వంలో
ఈ సస్పెన్స్, రొమాంటిక్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ధరణి ధరన్ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. దీనితో రాజా రంగుస్కి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











