కమల్ 'మైఖేల్ మదన కామరాజు' హిందీ రీమేక్
కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రం 'మైఖేల్ మదన కామరాజు' ఇప్పుడు హిందీలో రీమేకా కానుంది. ఆ రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.వాళ్లు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్. వీరిద్దరూ రైట్స్ కోసం తమిళ నిర్మాతలను సంప్రదిస్తున్నారు. అలాగే దర్శకులుగా ఫరా ఖాన్, ప్రియదర్శన్ పోటీ పడుతున్నారు. ఒకవేళ ఫరాకి చెందిన నిర్మాత చేతికి ఈ సినిమా వస్తే..హీరోగా సల్మాన్ ఖాన్‌ను ఎంచుకుంటారు. ప్రియన్ రూపొందిస్తే అక్షయ్ కుమార్‌ని తీసుకోవాలని ప్లాన్ లో ఉన్నారు.ఇక 'మైఖేల్ మదన కామ రాజు' చిత్రం లో కమల్ హాసన్ నాలుగు పాత్రల్లో కనిపించి హాస్యం పండించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంత హాట్ గా మార్కెట్లో ఇంత కాలం అయిన తర్వాత మారటం ఆశ్చర్యకరంగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











