Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
సూర్య సినిమాలో విలన్గా మోహన్ బాబు!
మాధవన్ హీరోగా 'సాలా ఖదూస్', వెంకటేష్ హీరోగా 'గురు' లాంటి బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో త్వరలో సౌత్ స్టార్ సూర్య హీరోగా సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగులో ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. శుక్రవారం(జూన్ 14) నుంచి డైలాగ్ కింగ్ షూటింగులో జాయిన్ అవుతారని టాక్.
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం సూర్య సొంత బేనర్ 2డి ఎంటర్టెన్మెంట్స్ పతాకంతో కలిసి ఆస్కార్ విన్నింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనూ ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
సూర్య నటించిన NGK మూవీ మే 31న విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. మరో వైపు డైరెక్టర్ కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూర్య చిత్రం 'కాప్పన్' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు 30న విడుదల కాబోతోంది. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈమూవీలో సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య ఎస్పీజీ కమెండోగా, మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, పిఎం కొడుకు పాత్రలో ఆర్య నటిస్తున్నారు.