సూర్య 37: భారత ప్రధాన మంత్రి పాత్రలో మోహన్ లాల్?

తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న 37వ చిత్రం కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో ఆయన భారత ప్రధాన మంత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మోహన్ లాల్ పాత్ర పేరు చంద్రగాంధ్ వర్మ అని తెలుస్తోంది. ఈ పాత్ర మేకోవర్ చూస్తుంటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుర్తుకొస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Mohanlal plays Indian prime minister in Suriya-KV Anand movie

ఈ చిత్రంలో సూర్య ప్రైమినిస్టర్ బాడీ గార్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సూర్య పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్య కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Mohanlal plays Indian prime minister in Suriya-KV Anand movie

సూర్య, కెవి ఆనంద్ కాంబినేషన్లో గతంలో అయాన్(వీడొక్కడే), మాత్రన్(బ్రదర్స్) లాంటి చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. త్వరలోనే ఈచిత్రం టైటిల్ ప్రకటించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X