మాఫియా లింకుల మోనికా బేడి చివరకు 'దేవదాసిని'గా
మాఫియాతో సంబంధాలున్నాయంటూ వివాదాల్లోకి ఎక్కిన మోనికా బేడీ త్వరలో 'దేవదాసిని'గా కనువిందు చేయనుంది. దేవదాసిల కథతో రూపొందించిన దేవదాసియన్ కథై పేరుతో ఈ చిత్రం తమిళ్‌లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని దేవదాసిని పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. అనూష్ క్రియేషన్స్ పతాకంపై జి.వెంకట్ అందిస్తున్నారు.ఈ చిత్రం గురించి నిర్మాత వివరాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఓ దేవదాసిని జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అన్నారు.
అలాగే ముంబైలో భారీ సెట్స్‌తో 45 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. దేవదాసిని పాత్రకు మోనికాబేడీ సరిగ్గా సరిపోతుందనే దర్శకుడి ఆలోచనను మోనికాబేడీ ఆచరణలో పెట్టింది. దేవదాసిని పాత్రలో నటించి ఆమె మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుని సెకండ్ ఇన్నింగ్ ప్రారం భిం చింది. ఈ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర రెడ్డి, పాటలు: పొందూరి, సంగీతం: దుర్గ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి.గౌతమ్ పెరుమాళ్లు, నిర్మాత: జి.వెంకట్.


Click it and Unblock the Notifications











