పెద్దాపురం వేశ్యగా మారిన మోనికా బేడీ
ఆ మధ్య తాజ్‌మహల్, స్పీడ్ డాన్సర్, సోగ్గాడిపెళ్లాం, శివయ్య వంటి చిత్రాల్లో నటించిన మోనికాబేడీ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ తర్వాత ఆమె అండర్ వలర్డ్ డాన్ అబూసలీంతో కలిసి పోర్జరీ కేసులో ఇరుక్కుపోయి జైలు శిక్ష అనుభవించింది. ఆమె తాజాగా 'దేవదాసియిన్ కథై" అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.. ఈ చిత్రం గురించి దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ- కథ వినగానే మోనికాబేడీ వెంటనే ఓకే చేసిందనీ, ఆమెకు సంబంధించిన సన్నివేశాలను ముంబయిలోని స్టూడియోలో మూడు నెలలు చిత్రీకరించామన్నారు. తాను గతంలో హిందీలో 'ఆర్‌డీఎక్స్" అనే చిత్రానికి దర్శకత్వం వహించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో వేశ్యల జీవితాల గురించి సుదీర్ఘంగా పరిశోధించి ఈ చిత్ర కథను తయారుచేసానని తెలిపారు. నిర్మాణం దాదాపు పూర్తయిందని ఈ నెల 28న విడుదల చేయనున్నామని దర్శకుడు వివరించారు.
మోనికా బేడీ తాజ్‌మహల్ స్పీడ్ డాన్సర్ పెద్దాపురం వేశ్య ఆర్ డి ఎక్స్ monica bedi taj mahal speed dansar peddapuram rdx gautham


Click it and Unblock the Notifications