మ్యాప్ గీసి హత్య చేస్తున్న ప్రభుదేవా..!?
కొరియోగ్రాఫర్‌గా ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ బలమైన ముద్ర వేసుకున్న ప్రభుదేవా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రం ద్వారా దర్శకుడిగా మారి దర్శకత్వంలో కూడా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ అయిన ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఉరిమి". పృథ్వీరాజ్, జెనీలియా జంటగా నటిస్తున్న ఈ చిత్రం వాస్కోడి గామా హత్య కథాంశంతో రూపొందిస్తున్నారు ప్రభుదేవా. ఇక హత్య విషయానికి వస్తే..ఓ నలుగురు స్నేహితులు కలిసి వాస్కోడి గామాను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నలుగురు స్నేహితులలో ఒక స్నేహితుడిగా ప్రభుదేవా నటిస్తున్నాడట. సినిమాలో వాస్కోడిగామాని హత్య చేయడానికి మ్యాప్ వేసే బ్రెయిన్ కూడా ఇతనికే ఉంటుందట. మ్యాప్ గీసి హత్య చేసేది కూడా ప్రభుదేవానే అని సమాచారం.
ప్రభుదేవా జెనీలియా నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఉరిమి పృథ్వీరాజ్ prabhu deva genelia nuvvu vastanante nenu vaddantana urimi prithviraj


Click it and Unblock the Notifications