అందువల్లే హాలీవుడ్ కన్నా వెనకబడి ఉన్నాం: కమల్‌హాసన్
అలాగే... ''భారత సినీ పరిశ్రమ యేటా వందలాది సినిమాలు నిర్మించి ప్రపంచ స్థాయిలో పోటీపడుతోంది. హాలీవుడ్‌తో పోల్చుకుంటే సాంకేతికంగానూ అభివృద్ధి చెందుతున్నాం. ప్రభంజనాలు సృష్టించగలుగుతున్నాం. కానీ ఆదాయంలో హాలీవుడ్ కన్నా తక్కువగా ఉంటోంది. ఎందుకంటే రూ.10 వేలు వెచ్చించి జీన్స్ దుస్తులు, రూ.5 వేలకు షూలు కొంటున్నారు. రోడ్డు పక్కన దుకాణంలో, ఫైవ్‌స్టార్ హోటల్‌లో టీ తాగడంలో చాలా తేడాలున్నాయి. దీనికి వారి అభిరుచులు, స్థోమతలే కారణం. అలాగే సినిమా టిక్కెట్లు కూడా. టిక్కెట్ల పెరుగుదల అంశానికి నేను ఎప్పటికీ మద్దతిస్తాను. భారత సినిమాను ప్రపంచంలోనే ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటాను'' అన్నారు.
ఇక భారతీయ చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తమిళ సినిమా సాంకేతిక పరంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న విషయం ఎవరూ కాదనలేని నిజమని కమలహాసన్ పేర్కొన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తమిళ సినిమా సాంకేతిక పరంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నా రు. అరుుతే ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు చేపట్టాలి అ నే విషయంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే విధంగా రెడ్ కెమెరా, డిజిటల్ టెక్నాలజీ వంటి అంశాలపై సదస్సులో విశ్లేషణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. స్క్రీన్ ప్లే రైటింగ్ వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు. సిని మాకు సంబంధించిన పలు అంశాలపై ప్రతిభావంతులైన కళాకారుల మధ్య చర్చలు ఫలవంతం అవుతాయని భావిస్తున్నట్లు కమల్ పేర్కొన్నారు.
నిర్మాత డి.రామానాయుడు మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను ఈ సదస్సులో తొలిసారిగా పాల్గొంటున్నానని, చాలా కొత్త అనుభవమని పేర్కొన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడి హోదాలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలైన సర్వీస్ టాక్స్, కాపీ రైట్స్ తదితర అంశాలను వివరించారు. ఇలాంటి సదస్సుల ద్వారా భావితరం కళాకారులకు చాలా ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత బర్రీ ఆస్‌బార్న్ పలు అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో హాలీవుడ్ నిర్మాత బారీ ఆస్బోర్న్, భారత సినీ ప్రముఖులు రజనీకాంత్, డి.సురేష్‌బాబు, ప్రియదర్శన్, గిరీష్‌కర్నాడ్, షీలా, సంతోష్‌శివన్, జయంతి, నదియా, సౌరభ్‌శుక్లా, లిజి, జయరామ్, సుకుమారి, కాట్రగడ్డ ప్రసాద్, సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూరు వసంతాల సినిమా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సు బుధవారమూ జరగనుంది.


Click it and Unblock the Notifications












