చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి కమెడియన్ యోగి బాబు.. కెప్టెన్ ధనాధన్ ధోని హామీ.. అసలేం జరిగిందంటే?

క్రికెట్ రంగంలో ప్రత్యర్థి జట్లను, బౌలర్లను గడగడలాడించిన లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మైదానం వీడి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ స్థాపించి సినిమాల నిర్మాణాలను చేపట్టారు. సంగీత దర్శకుడు రమేష్ తమిళమణి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భార్య సాక్షి ఆనంద్‌తో కలిసి ఎంఎస్ ధోని పాల్గొన్నాడు. ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ ఆడియో ఈవెంట్‌లో కమెడియన్ యోగిబాబు గురించి మాట్లాడుతూ...

నాకు చెన్నైతో విడదీయలేని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాకు ఎన్నో అనుభూతులను మిగిల్చింది. ప్రస్తుతం ఈ వేదికపై నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. నా మనసుకు నచ్చిన విషయాలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు తమిళ భాష రాకపోవచ్చు. కానీ తమిళంతో నాకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవు అని ధోని అన్నాడు.

MS Dhoni assured to take Comedian Yogibabu into Chennai Super Kings of IPL at LGM Audio Event

నాకు డెస్టినీ అనే పదంపై నమ్మకం లేదు. కానీ చెన్నైతో ముడిపడి ఉన్న జీవితం చాలా భావోద్వేగాన్ని కలిగిస్తుంది. నేను తొలిసారి టెస్ట్ చెన్నైలో ఆడాను. టెస్టుల్లో హయ్యెస్ట్ స్కోర్ చెన్నైలోనే నమోదైంది. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత నేను పూర్తిగా తమిళనాడు వాడికి అయిపోయాను. తమిళ అభిమానులు చూపించిన ప్రేమ ఊహించలేను. నా జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడలను చూశాను. CSK ఎక్కడ ఆడినా సపోర్ట్ ఉండేది. చెన్నైలో ఆడితే ఫ్యాన్స్ నుంచి వచ్చే సపోర్ట్ చూస్తే ఉప్పొంగిపోయేవాడిని అని ఎంఎస్ ధోని చెప్పారు.

LGM మూవీలో నటించిన యోగిబాబు గురించి మాట్లాడుతూ.. యోగిబాబుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడాలని ఉందని చెప్పాడు. రాయుడు రిటైర్డ్ అవుతున్నాడని చెప్పి.. ఆ ప్లేస్‌లో యోగిబాబు ఆడాలని అనుకొంటున్నాడు. కానీ ఓ సమస్య ఉంది. నీ కాల్షిట్స్, నీ అపాయింట్‌మెంట్స్ నిన్ను క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాయా? ఒకవేళ టీమ్‌లో ఉంటే యోగిబాబు అందుబాటులో ఉన్నాడా? లేదా అని చూసుకోవాలి అని ఎంఎస్ ధోని సెటైర్ వేశాడు.

MS Dhoni assured to take Comedian Yogibabu into Chennai Super Kings of IPL at LGM Audio Event

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో యోగిబాబును తీసుకొనే విషయంలో మరోసారి ఆలోచిస్తాను. సీఎస్‌కే జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తాను. కానీ యోగిబాబు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పిచ్‌పై బౌలర్లు చాలా ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో. నేను సీఎస్‌కే జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతాను అని ధోని సరదాగా మాట్లాడుతూ.. ఈవెంట్‌లో అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు.

ఇదిలా ఉండగా, యోగిబాబు కేవలం నటుడు, కమెడియన్ మాత్రమే కాదు. అతడిలో మంచి క్రికెటర్ ఉన్నారు. ఇటీవల తన స్నేహితులతో క్రికెట్ ఆడుతూ బంతిని బౌండరీ దాటించి సునామీ ఇన్సింగ్స్‌ను ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా షూటింగు సమయంలో ధోనితో మాట్లాడుతూ.. CSK జట్టులో చేరి క్రికెట్ ఆడాలని ఉందనే కోరికను యోగిబాబు బయటపెట్టారట. దాంతో ధోని ఆడియో ఫంక్షన్‌లో ఈ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పడం వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X