MS Dhoni భార్యపై భారీగా సెటైర్లు.. ఇద్దరు భార్యలు అంటూ.. ఫుల్ ఫన్‌తో ఎంఎస్ ధోని స్పీచ్!
లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాలను నిర్మించే ప్రయత్నాలు ఊపందుకొన్నాయి. భార్య సాక్షి పర్యవేక్షణలో సినీ నిర్మాణాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళంలో సినిమాలు శరవేగంతో పూర్తి చేసుకొంటున్నాయి. తాజాగా ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM (Lets Get Married) అనే సినిమా పూర్తయింది. ఈ సినిమాలో హరీష్ కల్యాణ్, ఇవానా నదియా, యోగి బాబు, మిర్చి విజయ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగిన జూలై 10వ తేదీన జరిగింది. ఈ వేడుకలో ఎంఎస్ ధోని ఫన్నీగా, ఎమోషనల్‌గా మాట్లాడారు. ధోని మాట్లాడిన స్పీచ్ వివరాల్లోకి వెళితే..
చెన్నైతో విడదీయలేని బంధం:నాకు చెన్నైతో విడదీయలేని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాకు ఎన్నో అనుభూతులను మిగిల్చింది. ప్రస్తుతం ఈ వేదికపై నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. నా మనసుకు నచ్చిన విషయాలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు తమిళ భాష రాకపోవచ్చు. కానీ తమిళంతో నాకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేవు అని ధోని అన్నాడు.

నా భార్య సాక్షితో :LGM (Lets get Married) మూవీ చూశాను. ట్రైలర్ ఇంతకు ముందే మనం చూశాం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ ట్రైలర్‌లో ఇవానా ఫ్యామిలీ బాగా కనిపించింది. కాఫీ ఇస్తుండగా తల్లివైపు చూసే చూపు నేను నా భార్య సాక్షిలో చూశాను. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. నదియా అద్బుతంగా నటించింది. ఆమె హావభావాలు, యాటిట్యూడ్ ఏంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇద్దరు మహిళల మధ్య హీరో హరీష్ నలిగిన తీరు ఫన్ క్రియేట్ చేసింది.
ఇద్దరు పిల్లలే కాదు.. :మీలో ఎంత మందికి పెళ్లి జరిగిందో తెలియదు. ప్రతీ ఇంట్లో బాస్ ఎవరో మీకు తెలుసు అంటూ సాక్షి వైపు చూసి నవ్వాడు. సాండీ నీకు పెళ్లి జరిగిందా అంటే ధోని అడగ్గానే.. ఇద్దరు పిల్లలు అనడంతో షాక్ తిన్నాడు. ఇద్దరు పిల్లలే కాదు.. ఇద్దరు భార్యలు ఉన్నా శాండీ బాగా డీల్ చేస్తాడు. ఎందుకంటే అతడు ఎక్కువ మాటలు చెప్పడు. రెండు చెవులతో వినడమే తెలుసు. యోగిబాబు, విజయ్ అద్బుతంగా నటించారు. చాలా క్లీన్ మూవీ ఇది. నేను నా కూతురుతో కలిసి కూడా చూసే చిత్రం ఇది. అద్బుతంగా నటించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అని ధోని అన్నారు.

విఘ్నేశ్‌తో నాకు అనుబంధం :LGM ఈవెంట్‌కు విఘ్నేశ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఓ షూట్‌లో కలిశాం. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మేమిద్దరం కలిసి మంచి సమయాన్ని ఎంజాయ్ చేశాం. మా మధ్య ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. మా అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకొంటున్నాను అని ధోని అన్నారు.

LGM మూవీ ఎలా మొదలైందంటే? :భార్యను చూసి భయపడే భార్త కాన్సెప్ట్‌తో విజయ్ వచ్చినప్పుడు నాకు చాలా ఫన్ అనిపించింది. సాక్షి కూడా నచ్చడం, ఈ సినిమా చేయాలని ఒప్పుకోవడంతో LGM మొదలైంది. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఈ సినిమాకు టీమ్ అత్యంత బలం. సినిమా ప్రారంభానికి ముందు సాక్షికి నేను ఓ సలహా ఇచ్చాను. ఇంటిని నిర్మించేటప్పుడు ఓ కలర్ వేస్తాం. అది నచ్చకపోతే దానిపై మరో కలర్ వేసుకొంటాం. అలాగే కథ నచ్చకపోతే.. మరో కథ గురించి ఆలోచించండి. ఒకసారి డిసైడ్ అయ్యాక.. వేరే విషయాలు ఆలోచించకండి అని చెప్పాను.

రికార్డు స్థాయిలో LGM:LGM మూవీ స్టార్ట్ అయ్యాక ఎక్కడ ఆగలేదు. ప్లాన్ చేసుకొన్న సమయం కంటే ముందుగానే రికార్డు టైమ్‌లో పూర్తి చేశాం. షూట్‌లో ఫుడ్ బాగుండేలా చూసుకోండి. ప్రతీ ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా చర్యలు తీసుకొన్నాం. మంచి ఫుడ్‌ను ఆస్వాదిస్తూ పని ముగించాలనేది నా ప్లాన్. నా ప్లాన్ ప్రకారమే టీమ్ చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించింది అని ధోని అన్నాడు.
ఇద్దరు మహిళల మధ్య ఓ మగాడు:LGM మూవీ సినిమా తప్పకుండా చూడండి. ఈ సినిమా ఫన్‌తో అందరికి వినోదాన్ని అందిస్తుంది. ఈ సినిమా ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ. అత్తా, కోడలు మధ్య ఓ మగాడు నలిగే కథ ఇది. పెళ్లికి ముందు కాబోయే భర్త, తల్లికి మధ్య జరిగే సీన్లు బాగుంటాయి. చాలా ఫన్‌గా ఉంది. ప్రతీ విషయంలో నాపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్. మళ్లీ థియేటర్‌లో ఈ సినిమా కోసం కలుద్దాం అని ధోని అన్నారు.


Click it and Unblock the Notifications











