Don't Miss!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
భాషాగా మారిన ఎంఎస్ ధోని.. రజినీకాంత్ స్టయిల్‌తో మాస్ లుక్.. వీడియో వైరల్
భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన కెరీర్‌కు ముగింపుకు పలికినా.. ఐపీఎల్ టోర్నిలో ఆడుతూ క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. తమిళ క్రికెట్ అభిమానులకు చేరువయ్యారు. తమిళ భాష, సినిమా అంటే ధోనికి చెప్పలేనంత ఇష్టం. ఇక రజనీకాంత్ అంటే మరీ ఇష్టం. గతంలో కూడా పలు యాడ్స్‌లో నటించిన ధోని తమిళ సినిమాలు, భాషపై తన అభిమానాన్ని చాటుకొన్నారు. ఇక త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ సీజన్ కోసం ధోని నటించిన ఓ ప్రోమో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2022 టోర్ని కోసం ధోని భాషాగా మారిపోయారు. రజనీకాంత్ మాదిరిగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఖాకీ చొక్కా, ఫ్యాంట్ ధరించాడు. తలైవా మాదిరిగా కూల్ గ్లాస్ పెట్టుకోవడమే కాకుండా భాషా స్టైల్లో తలకు విగ్ కూడా పెట్టుకొన్నాడు. రజనీకాంత్ మాదిరిగా కళ్లజోడు, మెడలో కర్చిఫ్ వేసుకొని మాస్ లుక్‌తో హంగామా చేశాడు. ప్రస్తుతం ధోని లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రోమో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ఐపీఎల్ టోర్నిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి హాట్ ఫేవరేట్‌గా మారింది. ఈ జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్, చటేశ్వర్ పూజారా లాంటి క్రీడాకారులు చేరడంతో యువకులతో కూడా ఈ జట్టు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. ఇటీవల జరిగిన వేలంపాటలో వీరద్దిరిన 12 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.
Think 🆒-ness, think #MSDhoni! 😎#DhonisNewLook #ComingSoon pic.twitter.com/pS9EgGxe8Q
— Star Sports (@StarSportsIndia) February 27, 2022
ఇదిలా ఉండగా, ఎంఎస్ ధోనికి సంబంధించిన న్యూ ఏజ్ నవల అథర్వ: ఒరిజిన్ అనే పుస్తకాన్ని ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ విడుదల చేశారు. తన పుస్తకం ఫస్ట్ కాపీ రిలీజ్ చేసినందుకు తలైవాకు ధన్యవాదాలు చెప్పారు.