ఇతరులను కించపరచమని అజిత్ చెప్పారా? - కస్తూరి

రీ - ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచీ వివాదాలతోనే వార్తలకు ఎక్కుతున్న కస్తూరి, మరో అడుగు ముందుకేసి టీవీ ఛానళ్లలోని డిబేటుల్లోనూ పాలుపంచుకుంటూ బాగానే హడావిడి చేస్తోంది. ఈ మధ్యే జాతీయ మీడియాలోని ఓ లైవ్ డిబేట్ లో పాలుపంచుకుంటూ ఆహారాన్ని తీసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. క్రమంగా అమ్మడి వ్యాఖ్యలకు ఆదరణ పెరుగుతుండగా, అమ్మడి నోటి జోరు కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ పోతోంది. అయితే తాజాగా కస్తూరి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ను టార్గెట్ చేసిందట.

ఈ మధ్య మంచి జోరు కనబరుస్తున్న కస్తూరిపై సాధారణంగానే సోషల్ మీడియాలో యాంటీ ట్రాల్స్ మొదలయ్యాయి. ఇక వీటిని కాస్త సీరియస్ గానే పరిగణిస్తున్న కస్తూరి, వీలైనంత వరకూ తన మాటకారితనం తోనే వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి కస్తూరి అజిత్ ఫ్యాన్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు అదే స్థాయిలో ఘాటైన సమాధాన మిచ్చి వారి నోళ్లను మూయించింది.

Much younger than Thala Himself - Actress Kasturi

ఇటీవలే అజిత్ వీరాభిమాని, కస్తూరి పాత వీడియోను పోస్ట్ చేసి, "కోలీవుడ్ లో ముదు ముసలి ఈమే, యవ్వనంలోనే ఈమె బాగుంది" అంటూ ట్యాగ్ చేశాడు. దీనికి అగ్గిమీద గుగ్గిలమే అయిన కస్తూరి, "ఎందుకు ఇలాంటి పిచ్చిరాతలకు నన్ను ట్యాగ్ చేస్తున్నారు.

ఇలాంటి హీనమైన జీవితం అవసరా మీకు? ఇలాంటి రాతలకు అజిత్ గారు మీకు అధికారికంగా అనుమతి ఇచ్చారా? అయితే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, అజిత్ సర్ కన్నా ఈ ముదుసలి ఐదేళ్లు చిన్నది" అంటూ గట్టిగానే సమాధానమిచ్చింది. ఏమైనా కస్తూరితో పెట్టుకుని నెగ్గుకురావడం అంత తేలికైన విషయం కాదని జనాలకు ఇప్పటికైనా అర్ధమవుతుందేమో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X