డైరెక్టర్ హద్దులు దాటాడు.. చెప్పుతో కొట్టా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ హాట్ కామెంట్స్!
ఖుషి, అత్తారింటికి దారేది చిత్రాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో నటి ముంతాజ్ నటించింది. ఆమె పాత్ర తక్కువ సమయమే అయినా అద్భుతమైన డాన్స్, గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది.తమిళ బిగ్ బాస్ 2 తో కూడా ముంతాజ్ బాగాపాపులర్ అయింది. మీటూ ఉద్యమం ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ముంతాజ్ మీటూ ఉద్యమం గురించి స్పందించింది.

అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా
నటి ముంతాజ్ మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ.. తాను కూడా కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. తాను భరించే ఓపిక ఉన్నంతవరకు వాటిని భరించానని తెలిపింది. హద్దులు దాటిన సందర్భంలో అంతే ఘాటుగా బదులిచ్చా.

చెప్పుతో కొట్టా
ఓ దర్శకుడు అలా ప్రవర్తించిన సమయంలో అతడికి బుద్ది చెప్పడానికి చెప్పుతో కొట్టానని ముంతాజ్ తెలిపింది. ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా దర్శకుడు పదే పదే విసింగించాడు. చివరకు సహనం కోల్పోయి అతడిని చెప్పుతో కొట్టానని ముంతాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మీటూ ఉద్యమం
మీటూ ఉద్యమాన్ని తాను ఫాలో కావడం లేదని ముంతాజ్ తెలిపింది. కానీ తనకు ఎదురైన సంఘటనలని మాత్రమే వివరించానని తెలిపింది. చాలా మంది నటీమణులు పలువురు ప్రముఖులపై చేస్తున్న ఆరోపణలు గురించి స్పందిస్తూ.. కేవలం ఒకవైపే చూసి అన్ని విషయాలు నిర్దారించలేము. నిజంగా వేధింపులు ఎదురై ఉంటె ఆరోపణలు చేయవచ్చు. కానీ వాటిని రుజువు చేయాల్సిన అవసరం ఉందని ముంతాజ్ తెలిపింది.

కేవలం నిందలు మాత్రమే
కేవలం నిందలు మాత్రమే వేస్తే కొంతకాలం తరువాత వాటిని ఎవరూ పట్టించుకోరు. అందుకే ఆరోపణల గురించి నేను స్పందించను. నిజమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే అప్పుడు వాటి గురించి మాట్లాడతా అని ముంతాజ్ తెలిపింది.


Click it and Unblock the Notifications











