ముంతాజా లేటెస్ట్ గా రాజాధిరాజ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. లారెన్స్ హీరోగా చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఆమెకు మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. లేడీ డాన్ గా ఈ చిత్రంలో కనిపించే ఆమె సిగెరెట్ కాలుస్తూ హంగామా చేస్తూంటుంది. ఇక ఆమె రెండు రోజుల క్రితం చెన్నై అవుట స్కర్ట్ లోని ఓ ధియోటర్ లో తన సినిమా చూసుకోవటానికి వెళ్ళింది. అయితే ఆమె ధియోటర్లో ఉందని తెలియగానే జనం చుట్టు ముట్టి ఓ సారి సిగెరెట్ అంటించమని అల్లరి చేసారు. అందులోనూ ఆ ధియోటర్ వద్ద పోలీసులు లేకపోవటం తో ఈ రభస చాలా సేపు జరిగింది. ధియోటర్ యాజమాన్యం వచ్చి జనాన్ని అదుపు చెయ్యాల్సి వచ్చింది. ఆమె సీట్లో కూర్చుంటే వచ్చి ఆమె ప్రక్కన నిలబడి ఫోటో దిగమంటూ ఓ అభిమాని బలవంతం పెట్టాడు. చివరకు సెల్ కెమెరా లో ఫోటో తీసుకున్నాక అతను శాంతించటం జరిగింది. ఇక తెరపై ఆమె డైలాగులు చెప్తూ అరవటం అదీ చేస్తూండటంతో విసుగెత్తిన ఆమె యాజమాన్యం సహకారంతో కారెక్కింది.