తాను నయనతార, నమితలు బరితెగించి వేషాలు పడుతున్నారని, వాళ్ళలా తాను విప్పి చూపనని మరో తమిళ ముద్దుగుమ్మ ముంతాజ్ విమర్శలు చేసింది. తాజాగా లారెన్స్ రాజాధిరాజా చిత్రంలో విలన్ గా చేసిన ఆమె తమిళ మీడియాతో మాట్లాడుతూ తాను హార్మోన్స్ ఇన్ బ్యాలన్స్ వల్ల లావుగా అయ్యాయని, అయితే ఇప్పుడు దాదాపు ఇరవై మూడు కేజీల దాకా తగ్గానని, అందంగా కనపడతానని అంటోంది. అలాగే త్వరలో తాను జీరో సైజు కి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కలేదని చెప్తోంది. అంతేగాక తనకు నమితలా పూర్తి స్ధాయిలో శరీరాన్ని చూపి వేషాలు పట్టాల్సిన అవసరం లేదని, అలాగే నయనతారలాగా చీప్ బిహేవ్ చేసి సినిమాలు పట్టాల్సిన ఖర్మ లేదని ఘాటుగా విమర్శలు చేస్తోంది. అయితే ట్విస్ట్ ఏమిటంటే రాజాధిరాజా చిత్రం పెద్ద హిట్టవుతుందని ఈ స్టేట్ మెంట్స్ ఇచ్చినామె..ఇప్పుడు ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఖంగుతింది.