twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లారెన్స్ కి అనారోగ్యం...అందుకే లేటైంది

    By Srikanya
    |

    చెన్నై: దెయ్యం కథలతో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు దర్శకుడు రాఘవ లారెన్స్‌. 'ముని'.. ఆ తర్వాత వచ్చిన 'కాంచన' (ముని-2) లారెన్స్‌ ప్రతిభకు అద్దంపట్టాయి. మాస్‌ కమర్షియల్‌ చిత్రాలతోపాటు హర్రర్‌ సినిమాలతో కూడా ప్రేక్షకులకు ఆశ్చర్యం, హాస్యాన్ని కూడా కలుగజేస్తారని చాటారు. ఇప్పుడు మూడో కొనసాగింపును కూడా సిద్ధం చేశారు. ఇందులో తాప్సి, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ లారెన్స్‌ హీరోగా కనిపించనున్నారు. కోవై సరళ, శ్రీమాన్‌ నటిస్తున్నారు.

    లారెన్స్‌ మాట్లాడుతూ.. ''రానున్న నాలుగో తేదీన క్లెమాక్స్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నాం. 20 రోజుల పాటు షూటింగ్ కొనసాగనుంది. దీంతో మొత్తం పూర్తవుతుంది. గ్రాఫిక్‌ సన్నివేశాలు జోడించడం కోసం మరో రెండు నెలల సమయం పడుతుంది. ఇటీవల అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవడంతో సినిమా ఆలస్యమైంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. 'కాంచన' మాదిరిగా ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటుంది''అని వివరించారు.

    ‘Muni 3′ to release in December

    చిత్రం గురించి హీరోయిన్ తాప్సీ మాట్లాడుతూ... నేను 'ముని 3'లో నటిస్తున్నా. అదీ.. హారర్‌ సినిమానే. నటిస్తున్నానన్న మాటేగానీ, ఈసినిమా విడుదలైనా నేను చూడను. ఎందుకంటే... నాకు అంత భయం'' అని చెబుతోంది.

    ''నిజ్జం.. దెయ్యాలున్నాయి. నేను చూడలేదు గానీ, నా స్నేహితుల అనుభవాలు వింటే నిజమే అనిపిస్తుంటుంది. కొంతమంది ఏ కారణం లేకుండా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటారు. దాన్ని ఏమనాలి?? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా..? దైవ శక్తిని నమ్మినప్పుడూ దుష్ట శక్తినీ నమ్మాల్సిందే. అందుకే నేను ఈ తరహా సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడను.

    అర్థరాత్రి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, తలుపులన్నీ మూసేసి, టీవీలో హారర్‌ సినిమాల్ని చూడడంలో.. ఓ వింతైన అనుభవం దాగుంటుంది. భయపడుతూనే ఆ అనుభవాన్ని ఆస్వాదించడం ఓ సరదా అలవాటు. అందుకే హారర్‌ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. మీరూ దెయ్యాల సినిమాల్ని చూస్తుంటారా? అని తాప్సిని అడిగితే ఏం చెప్పిందంటే - ''అమ్మో.. హారర్‌ సినిమాలా? నాకు చాలా భయం. ఒకసారి ఓ సినిమా చూశానంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమానే మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. అందుకే.. వాటి జోలికి అస్సలు వెళ్లను..'' అంటోంది. దెయ్యాల టాపిక్‌ అనేసరికి చాలా విషయాలే మాట్లాడింది.

    English summary
    Muni 3, has now been completed. Lawrence is the directing this film, while Taapsee is playing the female lead. According to the latest update, the makers are planning to release the film in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X