Hatya లీలను చంపింది ఎవరు? ఏజెంట్ ఆదిత్యగా మురళీశర్మ ఇన్వెస్టిగేషన్

తమిళ హీరో విజయ్ ఆంటోనీ పలు విభిన్న చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా త్వరలోనే తన కొత్త సినిమా హత్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిసున్నారు. రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి కమల్ బోరా, జీ ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు మురళీ శర్మ ఏజెంట్ ఆదిత్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

లీలను చంపింది ఎవరు అనే కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏజెంట్ ఆదిత్యగా రంగంలోకి దిగారు మురళీ శర్మ. ఆయన చేపట్టిన విచారణ ఇంటెన్స్‌గా సాగుతున్నట్లు పోస్టర్ లుక్‌లో తెలుస్తోంది. కాంట్రాక్ట్, స్లీజీ, వై అనే ప్రశ్నల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మురళీ శర్మ లుక్ డిఫరెంట్‌గా ఉంది. 1923లో జరిగిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా హత్య సినిమాను తెరకెక్కించారు.

 Murali Sharma as Angent Aaditya look goes viral

హత్య చిత్రంలో జాన్ విజయ్, రాధికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X