డైరెక్టర్ మురుగదాస్ అరెస్ట్
ప్రముఖ తమిళ దర్శకుడు, తెలుగువారికి సుపరిచితుడైన మురుగదాస్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తెలుగులో చిరంజీవితో "స్టాలిన్" సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ వచ్చిన పేచీ "స్టాలిన్"తో కాదు. మురుగదాస్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం 'గజినీ'తో గొడవ వచ్చింది.
మురుగదాస్ ప్రస్తుతం "గజిని" హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలో అమీర్ ఖాన్ హీరో. ఆ బాలీవుడ్ సినిమాకు విడుదలకు ముందే పెద్ద క్రేజ్ ఏర్పడింది. తెలుగు, తమిళ భాషల్లో గజిని చిత్రాన్ని నిర్మించిన తమిళ నిర్మాత సేలం చంద్రశేఖర్ మురుగదాస్ మీద చీటింగ్ కేసు పెట్టారు. తనకు తెలియకుండా మురుగదాస్ తన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడని, తనకు రావలసిన రాయల్టీని కూడా ఇవ్వలేదని సేలం చంద్రశేఖర్ ఆరోపణ.


Click it and Unblock the Notifications











