Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూర్య ‘సెవెంత్ సెన్స్’: మరుగున పడ్డ మహావీరుడి కథ
సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొంది విడుదలకు సిద్దమవుతున్న చిత్రం సెవెంత్ సెన్స్. ఈ చిత్రం మరుగున పడ్డ తమిళనాడుకు చెందిన ఒక మహావీరుడి కథతో తెరకెక్కిందని దర్శకుడు ఏఆర్.మురుగదాస్ పేర్కొన్నారు. సూర్య, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం సెవెంత్ సెన్స్. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం దీపావళి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఆడియో నాలుగు రోజుల క్రితం మార్కెట్లోకి విడుదలైంది. ఆడియో సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ తమిళనాడులో ఆరవ శతాబ్ధానికి చెందిన పల్లవ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చైనా దేశంలో ఎలా చరిత్ర కెక్కాడు అనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం సెవెంత్ సెన్స్ అని తెలిపారు. ఈ చిత్రానికి సూర్య పడిన శ్రమ అంతా ఇంతా కాదన్నారు. ఆయన సహకారం లేకపోతే చిత్రం ఇంత గొప్పగా వచ్చేది కాదన్నారు.
ఒక తెలివైన యంగ్ సైంటిస్ట్‌గా శృతిహాసన్ నటన సూపర్ అన్నారు. ఆమె పాత్ర హీరో పాత్రకు దీటుగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో బౌద్ధ గురువు పాత్ర కోసం మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందానని సూర్య తెలిపారు . సెవెంత్ సెన్స్ వంటి ఒక అద్భుత చిత్రం ద్వారా తమిళంలో హీరోయిన్గా పరిచ యం కావడం ఆనందంగా ఉం దని శృతి పేర్కొన్నారు. సైన్స్ కీ,మానవ నాగరకతకీ కొన్ని నమ్మకాలుకూ ముడివేసే ఈ కథలో సూర్య కొత్త అవతారంలో కనిపించనున్నాడు. కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని, ఈ పాత్ర నిడివి ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందని కోలీవుడ్ సమాచారం. అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించాడట. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగులో అందించబోతున్నాడు.