»   » అవును కాపీయే...ఒప్పుకున్న దర్శకుడు మురగదాస్

అవును కాపీయే...ఒప్పుకున్న దర్శకుడు మురగదాస్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    చెన్నై : స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన 'తుపాకి' చిత్రం తాజా పోస్టర్...హాలీవుడ్ చిత్రం పోస్టర్ An Officer and a Gentleman చిత్రం పోస్టర్ ని యాజటీజ్ గా దింపేసారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు మురగదాస్ ని మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. దానికి సమాధానంగా మురగదాస్ మాట్లాడుతూ...మనం దేన్నేనే ఎక్కువగా ఇష్టపడినప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది. అలాగే ఈ పోస్టర్ డిజైన్ కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈ రకంగా బయిటపడింది అని చెప్పుకొచ్చారు. ఆయన ఇలా అవును కాపీనే అని ఒప్పుకోవటం చాలా మంది మెచ్చుకుంటున్నారు.


    విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. నవంబర్ 9 న ఈ చిత్రం విడుదల అవుతోంది.

    ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు.

    ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా అధినేత సీజే శోభా చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్‌లా తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.

    English summary
    AR Murugadoss has said that a still from Thuppakki has some resemblances with An Officer and a Gentleman. According to him, if we admire something, it sub-consciously finds a place in our work. However, the still had striking resemblances with 1982s Hollywood movie An Officer and a Gentleman directed by Taylor Hackford.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more