twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా డైరక్టర్ తమ్ముడు హీరోగా సినిమా ప్రారంభం

    By Srikanya
    |

    చెన్నై : స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ హీరో అయినట్లే మరో స్టార్ దర్శకుడు తమ్ముడు కూడా హీరోగా తెరంగ్రేటం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురగదాస్ తమ్ముడు హీరోగా సినిమా ప్రారంభం అవుతోంది. మురగదాస్ నిర్మాతగా ఏ.ఆర్‌.మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'వందకుచ్చి'. ఇందులో మురగదాస్‌ చిన్నాన్న కుమారుడు దిలీపన్‌ హీరోగా, ఆయనకు జంటగా అంజలి నటిస్తున్నారు. కిన్సిలిన్‌ తెరకెక్కిస్తున్నాడు. కథ డిమాండ్‌ మేరకే తన తమ్ముణ్ని హీరోగా ఎంచుకున్నట్లు చెప్పాడు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌.

    మురుగదాస్‌ మాట్లాడుతూ.. 'నేరాలనేవి గతంలో చాటుమాటుగా ఉండేవి. ప్రస్తుతం బహిరంగంగానే చోటుచేసుకుంటున్నాయి. దీన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసకు నా తమ్ముడైనందునే దిలీపన్‌ను హీరోగా ఎంచుకోలేదు. కథకు సరిగ్గా నప్పుతాడనే పేరు పరిశీలించారు. భయంకర సంఘటన హీరో జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుంది? ఆపై అతని పయనం ఎటు సాగుతుందో అనే విషయాలను అత్యంత ఆసక్తికరంగా చూపించనున్నాం. ఈ నెల 13న ఆడియోను విడుదల చేసి, మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తామని' చెప్పారు.

    జర్నీ చిత్రం హిట్ సెంటిమెంట్‌తో అంజలిని ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారా? అన్న ప్రశ్నకు ఏఆర్ మురుగదాస్ బదులిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. ఇకపోతే ఈ వత్తికుచ్చి చిత్రం హీరో కోసం చాలా మందిని పరిశీలించామన్నారు. చిత్రంలో ఆటో డ్రైవర్ అయిన హీరో పాత్రకు దిలీపన్ చక్కగా నప్పుతాడని భావించి ఎంపిక చేశామని తెలిపారు.

    అదే విధంగా హీరోయిన్ పాత్రకు అంజలి కరెక్టుగా ఉంటుందనిఎంపిక చేశామన్నారు. హీరోయిన్ తరచూ హీరో ఆటోలో ప్రయాణించడం వల్ల వారి మధ్య ప్రేమ మొలకెత్తుతుందన్నారు. కథ విషయానికొస్తే సమాజంలో అన్యాయాలు, అక్రమాలు ప్రతి నిత్యం కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఘోరమన్నారు. అలాంటి వాటిని ఎదిరించే యువకుడిగా వత్తికుచ్చి చిత్రంలో దిలీపన్ నటిస్తున్నారని తెలిపారు.

    దర్శకుడు కింగ్‌స్టన్ పనితీరు సంతృప్తినిచ్చిందన్నారు. ఆయన కథ చెప్పిన దాని కంటే బెటర్‌గా తెరపై ఆవిష్కరిస్తున్నారని మురుగదాస్ తెలిపారు. ఈ సంచలన దర్శకుడు ప్రస్తుతం తుపాకీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తూ బిజీగా ఉంటూ మరోపక్క సొం తంగా నిర్మిస్తున్న వత్తికుచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షించడం విశేషం. అనంతరం ఆట్‌లీ దర్శకత్వంలో ఆర్య, నయనతార జంటగా నటించనున్న 'రాజారాణి' చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. దర్శకత్వం విషయానికొస్తే హిందీలో తుప్పాక్కి రీమేక్‌తో బిజీగా ఉన్నానని మురుగదాస్‌ పేర్కొన్నాడు.

    English summary
    A.R.Murugadoss has become one of the biggest Directors in Indian Cinema. Recently, he became as successful Producer too through the movie 'Engeyum Eppodhum', which featured Jai, Anjali, Shravanand and many others. Now director-turned-producer Murugadoss has decided to launch his younger brother Saravanan. He is launching Saravanan in his own Production venture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X