9 కోట్లు డిమాండ్ చేస్తున్న దర్శకుడు
గజనీ వంటి సక్సెస్ ఫుల్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎఆర్ మురగదాస్ తన తదుపరి చిత్రానికి తొమ్మిది కోట్లు డిమాండ్ చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. సూర్య హీరోగా చేస్తున్న 'ఎంజుమ్ అరివు' చిత్రం కోసం ఈ హై రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ మాత్రం రెమ్యునేషన్ ఎక్కువేమీ కాదని మురుగదాస్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన గజనీ చిత్రానికి గానూ ఏడు కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో చెప్పుకున్నారు. బయిట ఉన్న డిమాండ్ ని బట్టే రెమ్యునేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద చెప్పుకోవాల్సిందేమీ లేదని ఆయన కొట్టిపారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











