'గజిని' మురుగదాస్ నెక్స్ట్ ఆ హీరోతో కన్ఫర్మ్
'గజిని' వంటి సూపర్ హిట్ ఇచ్చిన మురగదాస్ అంటే తమిళ,తెలుగు,హిందీ భాషల్లో మంచి క్రేజ్. ఇప్పుడాయన సూర్య హీరోగా చిత్రం పూర్తి చేసి రిలీజ్ కి సిద్దం చేసారు.ఆ తర్వాత ఆయన ఏ హీరోతో చేస్తాడనేది పరిశ్రమలో ఆసక్తి నెలకొనింది.అయితే ఈ సారి ఆయన విజయ్ తో సినిమా చేయటానకి కమిట్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయినట్లు, ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే ఈ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. అలాగే హేరీశ్ జయరాజ్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఎన్నుకున్నారు. అత్యంత బారీగా ఆ చిత్రం రూపొందించటానకి ఆయన స్క్రిప్టుని సిద్దం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ శంకర్ దర్శకత్వంలో నన్భన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే జయం రాజా దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న వేలాయుధం చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.వేలాయుధం చిత్రం తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అజాద్ చిత్రానికి రీమేక్.


Click it and Unblock the Notifications











