'జర్నీ' డైరక్టర్ కథని దొంగిలించి మరీ..
జర్నీ దర్శకుడు కథని తీసి వేసుకుని దర్శకుడు మురుగ దాస్ సెవెంత్ సెన్స్ చిత్రం తీసాడంటూ కోలీవుడ్ లో హఠాత్తుగా రూమర్స్ ప్రారంభమయ్యాయి. సెవెంత్ సెన్స్ విడుదలైన చాలా రోజుల తర్వాత ఇలాంటి టాక్ రావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ పత్రికల్లో రాసేదాని ప్రకారం మురగదాస్ దగ్గరకు జర్నీ దర్శకుడు శరవణ్ రెండు కథలు పట్టుకొచ్చాడు. అందులో మొదటిది సెవెంత్ సెన్స్ అనీ,రెండోది జర్నీ కథ ..అయితే మురగదాస్ రెండు కథలు వినీ,సెవెంత్ సెన్స్ తనకు బాగా నచ్చటంతో వెంటనే దానిని ఇవ్వమని అడిగాడని,అయితే శరవణ్ ఒప్పుకోలేదని,అప్పుడు జర్ని చిత్రం చేయటానికి నిర్మాతగా తాను ఉండటానకి ముందుకు వచ్చాడని చెప్పుకుంటున్నారు.
ఆ రకంగా జర్నీ కథ పట్టాలెక్కి సూపర్ హిట్టైందని,జర్నీ దర్శకుడు సైలెంట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. మురగదాస్ తానే కథ, స్క్రీన్ ప్లే,దర్శకత్వం చేసినట్లు వేసుకున్నారు. ఇక జర్నీ దర్సకుడు గతంలో తెలుగులో రామ్ హీరోగా గణేష్ అనే చిత్రం తీసాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు తమిళంతో తీసిన జర్నీ చిత్రం తెలుగులో సైతం మెగా హిట్ అయ్యింది. విడుదలైన మొదటి వారంలోనే ముప్పై ఐదు ప్రింట్ల వరకూ పెంచవలసివచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రేమిస్తే, షాపింగ్ మాల్ చిత్రాలు అందించిన సురేష్ కొండేటి డబ్ చేసి విడుదల చేసారు.


Click it and Unblock the Notifications











