మురుగదాస్ నెక్ట్స్ వారితోనే?
'గజనీ'తో సంచలన విజయం సాధించిన మురగదాస్ తన తదుపరి చిత్రాన్ని సూర్య,కత్రినాకైఫ్ కాంబినేషన్ లో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ పాకెడ్ గా ఉంటుందని చెప్తున్నారు.'గజనీ' రికార్డులు బ్రధ్దలు కొట్టేలా దీన్ని రూపొందించాలని మురగదాస్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే కేవలం తమిళంలోనే కాక హిందీ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అలాగే కథలో ఓ పారా సైకాలజీకి సంభంధించిన అంశం కూడా చర్చించబడుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం గురించి గత కొద్ది రోజులుగా చెన్నైలో స్క్ర్రప్టు పై కుస్తీ పట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్యలో అనేక బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా స్క్రిప్టు పూర్తి కానిదే ఏదీ కమిట్ కానని చెప్పారని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక తమిళ 'గజనీ' చిత్రాన్ని సూర్యతోనే మొదట తీయటం అది తెలుగులో సైతం ఘన విజయం సాధించటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కత్రినాకైఫ్ బాలీవుడ్ లోనే కాక తెలుగులోనూ మల్లీశ్వరి,అల్లరి పిడుగు చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











