»   » ప్రముఖ సంగీత దర్శకుడు దక్షిణామూర్తి మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు దక్షిణామూర్తి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ దర్శకుడు వి.దక్షిణామూర్తి ఒక లేరు. 94 ఏళ్ల దక్షిణామూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన చెన్నై మైలాపోర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

కెరీర్లో అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దక్షిణా మూర్తి మళయాలం, హిందీ, తమిళ బాషల్లో రూపొందిన చిత్రాల్లో దాదాపు 850కిపైగా పాటలను కంపోజ్ చేసారు. ముఖ్యంగా మళయాల చిత్రాల్లో ఆయన అప్పట్లో బాగా పాపులర్ సంగీత దర్శకుడిగా పేరొందారు.

V Dakshinamoorthy

మళయాలంలో రూపొందిన 'జీవిత నౌక' అనే చిత్రంతో 1951లో సినీ రంగంలోకి ప్రవేశించిన దక్షిణా మూర్తి 1960ల్లో అనేక చిత్రాలకు పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు సంగీత దర్శకుడిగా మనుగడ సాగించారు. దాదాపు 125 చిత్రాలకు సంగీతం అందించారు.

దక్షిణా మూర్తిని సెమీ-క్లాసికల్ సాంగుకు మాస్ట్రోగా అభివర్ణిస్తారు. ఆయన సంగీత దర్శకత్వంలోనే పి. సుశీల లాంటి సింగర్లు సినీమా రంగానికి పనిచయం అయ్యారు. ప్రముఖ మళయాల గాయకుడు ఏసుదాసు ఫ్యామిలీలోని మూడు తరాల కెరీర్లో దక్షిణా మూర్తి ముఖ్య పాత్ర పోషించారు. ఏసుదాసు తండ్రి ఆగస్టిన్ జోసెఫ్, కుమారుడు విజయ్ ఏసుదాసులు కూడా ఈయనతో కలిసి పని చేసినవారే. కేరళకు చెందిన దక్షిణా మూర్తి ఆ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుతో పాటు, లైఫ్ టైం అచీవ్ మెంట్ పుస్కారం అందుకున్నారు.

English summary
V Dakshinamoorthy, the legendary music composer who gifted more than 850 songs in Malayalam, Hindi and Tamil, died at his house in Mylapore on Friday. He was 94 years old.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu