twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతుండటంతో గతనెల 27వ తేదీన ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన గతం మర్చిపోయారని, ఆయన్ను బ్రతికించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

    Music Composer MS Viswanathan's Health Condition Worsens

    రీసెంట్ గా ఆయన్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా వెళ్లి చూసి , కొద్దిసేపు ఆయన వద్దగడిపి వచ్చారు. ఎంతో అభిమానలు, ఫిల్మ్ ఫర్సనాలిటిలు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్దిస్తున్నారు.

    ఆయన స్వరపరిచిన కొన్ని పాటలు ఇక్కడ చూడండి....

    1928, జూన్ 24న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించిన ఎమ్మెస్ ఎన్నో చిత్రాలకు సంగీత సారథ్యం వహించారు. తమిళంలో 510 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆయన మలయాళంలో 76, తెలుగులో 70 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు.

    ముఖ్యంగా ఆయన సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లో లేత మనసులు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథకాదు, గుప్పెడు మనసు వంటి చిత్రాల్లోని పాటలు శ్రోతల మదిని ఎంతో ఆకట్టుకున్నాయి.

    English summary
    The health condition of legendary music composer MS Viswanathan aka MSV, who is now undergoing treatment at a private hospital in Chennai, is said to be critical.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X