అభిమానులు అసహ్యించుకునేలా నాతో చేయించాడు: దర్శకుడిపై శ్రద్ధా శ్రీనాథ్

Recommended Video

'My Character In Nerkonda Paarvai May Be Hated By Fans' Says Shraddh || Filmibeat Telugu Srinath

'జెర్సీ' మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కన్నడ బ్యూటీ త్వరలో తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న 'నెర్కొండ పార్వయ్' చిత్రంలో కనిపించబోతోంది. హిందీలో సూపర్ హిట్ 'పింక్' చిత్రానికి ఇది రీమేక్.

'నెర్కొండ పార్వయ్' మూవీలో శ్రద్దా శ్రీనాథ్ అత్యాచారానికి గురైన బాధితురాలిగా కనిపించబోంది. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని, తనలోని యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులను అబ్బుర పరుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

నాకు చాన్స్ రాలేదనే అనుకున్నా

నాకు చాన్స్ రాలేదనే అనుకున్నా

‘నెర్కొండ పార్వాయ్' మూవీ ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అవకాశం వస్తుందని ఊహించలేదని, ఆడిషన్స్ పూర్తయినా... చాలా రోజుల వరకు ఎలాంటి పిలుపు రాక పోవడంతో ఈ సినిమాలో తాను సెలక్ట్ కాలేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

అభిమానులు అసహ్యించుకునేలా నాతో చేయించాడు

అభిమానులు అసహ్యించుకునేలా నాతో చేయించాడు

మూడు వారాల తర్వాత దర్శకుడు హెచ్.వినోద్ నుంచి పిలుపు వచ్చింది. నాకు కొన్ని సీన్లు ఇచ్చి నటించమని అడిగారు. మీ అభిమానులు మిమ్మల్ని అసహ్యించుకునే స్థాయిలో మీ పెర్ఫార్మెన్స్ ఉండాలి అన్నారు. నేను చేసింది ఆయనకు నచ్చడంతో ఫైనలైజ్ చేశారు... అని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు.

లాయర్ పాత్రలో అజిత్

లాయర్ పాత్రలో అజిత్

అజిత్ అంటేనే మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే ‘నెర్కొండ పార్వయ్' మూవీలో అజిత్ లాయర్ పాత్ర చేస్తున్నాడు. అత్యాచార బాధితుల తరుపున వాధించే అడ్వకేట్‌గా నటిస్తున్నాడు. హిందీ పింక్ మూవీలో ఈ పాత్ర అమితాబ్ బచ్చన్ చేసిన సంగతి తెలిసిందే.

నెర్కొండ పార్వయ్

నెర్కొండ పార్వయ్

నెర్కొండ పార్వయ్ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలమ్‌, ఆండ్రియా, అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X