తొలి త్రీడీ ‘మై డియర్ కుట్టీ చేతన్’ అప్పాచన్ మృతి

By Srikanya

భారతదేశ తొలి త్రిడి చిత్రం 'మై డియర్ కుట్టీ చేతన్' నిర్మాత, దర్శకుడు అయిన జోజో అప్పాచన్ కేరళలో మృతి చెందారు. కొచ్చి లోని ప్రెవేట్ హాస్పటిల్ లో కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం రాత్రి ఆయన మరణించారు. 81 సంవత్సరాల అప్పాచ్చన్ కి భార్య,ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన పరిస్ధితి హఠాత్తుగా సీరియస్ కావటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించారు. ఆయన గత పది సంవత్సరాలుగా కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన మృతికి కేరళ చిత్ర పరిశ్రమ నివాళలు అర్పించింది.

1984లో మొదటి త్రీడీ 'మై డియర్ కుట్టీ చేతన్' తర్వాత అది ఓ తరాన్ని ఉర్రూతలూగించింది. పెట్టిన పెట్టుబడికి అరవై రెట్లు సంపాదించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత కానీ మన వాళ్లు ఆ త్రీడి ట్రెండ్ ని అందుకోలేకపోయారు. దాదాపు ఇరవయ్యేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయ సినిమా పరిశ్రమ తిరిగి 'త్రీడీ' వైపుగా ప్రయాణం మొదలెట్టుంది. రెగ్యులర్ ఎనలాగ్ ఫార్మాట్‌లో ఎన్ని కోట్లు ధారబోసి ఎన్ని వాణిజ్య విలువలు జోడించినా విజయాలు నామమాత్రమై, భవిష్యత్తు అగమ్య గోచరమైన పరిస్థితుల్లో పాత 'త్రీడీ' ఆలోచనని పైకి తీసి దులిపి కొత్త బాట పడుతోంది. ముఖ్యంగా 'అవతార్' త్రీడీ వెర్షన్ వల్ల మనవాళ్ళు మళ్లీ ఈ బాట పట్టడానికి నడుం బిగించారు.

మొన్నామధ్యన 'అవతార్' త్రీడీ కూడా దేశంలో విజయఢంకా మోగించడంతో బాలీవుడ్ దర్శకుడు విక్రంభట్ త్రీడీ 'హాంటెడ్' సినిమాతీసాడు. . పెట్టిన 13 కోట్లకి 40 కోట్లు రావటంతో అందరి దృష్టీ మళ్లీ త్రీడిపై పడింది. దాంతో వెంటనే తొలి త్రీడీ మలయాళ దర్శకుడు జిజో అప్పాచన్ అప్రమత్తమై తన చిత్రంతో మళ్లీ తెరమీదకు వచ్చాడు. మై డియర్ కుట్టీ చేతన్ (హిందీలో ఛోటా చేతన్) మళ్లీ విడుదల చేశాడు. కానీ కాన్సెప్టు ఈ కాలానికి కనెక్టు కాకపోవటం వల్ల జిజో ఆశలు నెరవేరలేదు. 1998లో డిజిటల్ శబ్ద ఫలితాలతో నవీకరించి రెండోసారి విడుదల చేసినప్పుడూ మరో 50 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది,

నందమూరి కళ్యాణ్‌రామ్ తెలుగులో త్రీడీకి శ్రీకారం చుట్టారు. సాధారణ యాక్షన్ చిత్రాలతో హీరోగా అనేక విఫలయత్నాలు చేసి త్రీడీతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిశ్చయించుకున్నారు. గత అక్టోబర్‌లోనే దీని షూటింగ్ ప్రారంభమైంది. 'ఒకరికొకరు' కెమెరామేన్ సునీల్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తే తెలుగులో తనే తొలి త్రీడీ నిర్మాతగా చరిత్ర కెక్కుతారు. నిర్మాత అనిల్ సుంకర కూడా అల్లరి నరేష్‌తో భారీ ఎత్తున త్రీడీ సినిమా ప్రకటించారు. మరో నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్‌తో త్రీడీలో కామెడీని నిర్మించేందుకు ముందుకొచ్చారు. మరోవైపు రవితేజ - తమిళ స్టార్ సూర్య కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం కూడా త్రీడీలో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. దీనికి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ఈయన అజిత్‌తో ఇటీవలే మంగత్త (గాంబ్లర్) కి దర్శకత్వం వహించారు. ఎన్ని త్రీడి సినిమాలు వచ్చినా తొలి భారతీయ త్రీడి చిత్ర మాత్రం మైడియర్ కుట్టి చేతన్ మాత్రమే. అంతటి అద్బుతం రూపొందించిన ఈ మళయాళ మాత్రికుడు మరణానికి ధట్స్ తెలుగు నివాళులు అర్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X