నమిత వాళ్ళ కోసమే భారీ అందాలు మెయింటైన్ చేస్తోంది
నన్ను అందరూ ఇలా లావుగా చూడటానికే ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తగ్గాలి అని ప్రశ్నిస్తోంది నమిత. అలాగే ఎక్కువ ఒళ్ళు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేమీ నా దరి చేరవు. ఎందుకంటే రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తుంటాను. అయినా లావుగా వుండటం అనేది నా శరీరతత్వం మాత్రమే. అయినా నేను రెగ్యులర్ గా డాన్స్ లు, స్విమ్మింగ్ చేస్తుంటాను. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాను. ఆరోగ్యం పట్ల నేను చాలా జాగ్రత్తగా వుంటాను. నా అభిమానులకు నచ్చని విధంగా మారాలనే ఆలోచన నాలో లేదు అంటోంది నమిత. ఇక భారీతనం కారణంగా ఆ మధ్య నేను ఒక వారం రోజుల పాటు హాస్పటల్ లో వున్నానని రూమర్స్ క్రియోట్ చేసారు. వాటిల్లో అస్సలు నిజం లేదు అంటూ తేల్చేసింది. ప్రస్తుంతం నమిత ప్రధాన పాత్రలో నమిత ఐ లవ్ యు అనే కన్నడ చిత్రం రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











