కమల్ హాసన్ కొత్త సినిమా డిటేల్స్

By Srikanya

కమల్ హాసన్ తన డైరక్షన్ లో చేయటానికి ఒప్పుకున్నారంటూ తమిళ దర్శకుడు మిస్కిన్ మీడియాకు కన్ఫర్మ్ చేసారు. పిబ్రవరి నుంచీ ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఈ విషయమై కమల్ మాత్రం పెదవి విప్పలేదు. ఇక మిస్కిన్ ఇప్పటికే స్క్రిప్టు మొత్తం రెండు వెర్షన్స్ రాసి కమల్ కు వినిపించాడని తెలుస్తోంది. స్క్రీన్ ప్లేలో కమల్ చెప్పిన మార్పులతో మూడో వెర్షన్ రెడీ చేస్తున్నారని సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రంలో చేయబోయే మిగతా ఆర్టిస్టుల ఫైనలైజేషన్ కూడా కమల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక మిస్కిన్ తాజా చిత్రం నందలాల చిక్కుల్లో ఇరుక్కుంది. నిర్మాతలతో ఆయనకు వచ్చిన పొరపొచ్చాలు వల్ల వారు రిలీజ్ చేసే వాతావరణం కనపడటం లేదు. అలాగే మిస్కిన్ తమిళ చిత్రం చిత్రం పేసిదే ఆధారంగా తెలుగులో ఇంతకుముందు మంచు మనోజ్ హీరోగా రాజూ భాయ్ చిత్రం వచ్చింది. సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. కమల్ లెటెస్ట్ ఫిలిం ఈనాడు కూడా పెద్ద గా విజయాన్ని నమోదు చేయలేదు. ఈనాడు చిత్రంలో వెంకటేష్ మరో ముఖ్యపాత్రలో చేసారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఎ వెన్సడే కి ఇది రీమేక్. ఇక మిస్కిన్,కమల్ కాంబినేషన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన అంజాదే చిత్రం చాలా బావుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X