డిటెక్టివ్ 2 వివాదం.. దర్శకుడు అవుట్.. డైరెక్టర్‌గా మారిన విశాల్
ఓ భారీ ప్రాజెక్ట్‌ను అనుకున్నాక.. విబేధాలు రావడం సహజం. దర్శకుడు-నిర్మాతకో, నిర్మాత-హీరోకో, హీరో-దర్శకుడికో ఇలా ఎవరి మధ్య అయినా గొడవలు రావచ్చు. వీటికి ఎన్నో కారణాలుండవచ్చు. అయితే తాజాగా ఇలాంటి ఓ భారీ బడ్జెట్ చిత్రంలోంచి దర్శకుడు బయటకు వచ్చేశాడు.. చేసేదేమీ లేక హీరోనే దర్శకత్వ బాధ్యతలను తలకెత్తుకున్నాడట. అసలా ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

భారీ హిట్ అయిన డిటెక్టివ్..
హారర్, థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడం దర్శకుడు మిస్కిన్ సిద్దహస్తుడు. మిస్కిన్-విశాల్ కాంబోలో వచ్చిన డిటెక్టివ్ మంచి విజయాన్ని అందుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది. అయితే దీనికి సీక్వెల్ కూడా వస్తుందని అప్పట్లోనే ప్రకటించారు.

నలభై కోట్లతో సీక్వెల్..
డిటెక్టివ్ సీక్వెల్‌కు సంబంధించిన పనులు మొదలై కొంత భాగం షూటింగ్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 40కోట్లతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తూ.. ఇప్పటికే ఆ బడ్జెట్ దాటి పోయిందని, ఇందుకు దర్శకుడి వ్యవహార శైలే కారణమని టాక్.

మిస్కిన్ అవుట్..
బడ్జెట్ పరిధి దాటుతుండటంతో విశాల్-మిస్కిన్ మధ్య విబేధాలు వచ్చాయని సమాచారం. అందుకే ఈ సినిమా నుంచి మిస్కిన్‌ను పక్కకి తప్పించారని కోలీవుడ్ టాక్. మధ్యలో ఇలా దర్శకుడు లేకపోవడంతో ఆ బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నాడట. ఎలాగూ ఇండస్ట్రీకి దర్శకుడు అవ్వాలనే వచ్చిన విశాల్.. ఎట్టకేలకు తన కోరిక తీర్చుకోబోతోన్నాడన్న మాట.
Recommended Video


సెటైరికల్‌గా స్పందించిన మిస్కిన్..
ఈ వివాదంపై దర్శకుడు మిస్కిన్ సెటైరికల్‌గా స్పందించాడు. తాను 40 కోట్లు అడగలేదని, 400 కోట్లు అడిగానని, శాటిలైట్ నుంచి హీరో దూకే సన్నివేశానికే 100 కోట్లు ఖర్చయ్యిందని వెటకారంగా ట్వీట్ చేశాడు. మరి ఈ వివాదం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











