కోలీవుడ్ స్టార్ హీరోను కూడా లైన్ లో పెట్టిన తెలుగు నిర్మాతలు
ఒక్కోసారి ఒక్కో హీరో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇక దర్శక నిర్మాతలది కూడా ఒకనొక సమయంలో ఫుల్ హవా కొనసాగుతోంది. అలాగే బిగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ కూడా నాన్ స్టాప్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి సీనియర్ల కంటే కూడా మొన్న శ్రీమంతుడు సినిమాతో పరిచయమైన మైత్రి వారు గ్యాప్ లేకుండా సినిమాలను వదులుతున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ అంటే ఇప్పుడు తెలుగులో అందరికంటే ఎక్కువ సినిమాలను నిర్మిస్తోన్న బ్యానర్. ఓనర్స్ రవి శంకర్, నవీన్ ఈ ప్రొడక్షన్ హౌజ్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. మొదట యూఎస్ లో తెలుగు సినిమాలను రిలీజ్ చేసి ఎన్నో ప్రాఫిట్స్ అందుకున్న ఈ ప్రొడక్షన్ నిర్మాతలు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక అక్కడి నుంచి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలతో పాటు మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. విజయ్ కోసం తమిళ దర్శకుల చేత కథలను రెడీ చేయిస్తున్నట్లు టాక్. కథ సెట్టయితే వీలైనంత త్వరగా తెలుగు తమిళ్ లో ద్విభాషా చిత్రంగా ఆ సినిమాను రూపొందించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











