ఎంత మాట అనేసింది: చిక్కుల్లో హీరో సూర్య భార్య జ్యోతిక... పోలీస్ స్టేషన్ వరకు!
ప్రముఖ సినీ నటి, హీరో సూర్య భార్య జ్యోతిక చిక్కుల్లో పడింది. వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీనంతటికీ కారణం ఆమె నటించిన 'నాచియార్' చిత్రమే. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇపుడు తమిళనాట ఆందోళనలు జరుగడానికి కారణమైంది.
Recommended Video


జ్యోతిక చెప్పిన డైలాగులే...
‘నాచియార్' చిత్రంలో జ్యోతిక చెప్పిన కొన్ని డైలాగులు వివాదానికి దారి తీశాయి. ఓ సన్నివేశంలో 'మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

భగ్గుమన్న హిందూ సంఘాలు
జ్యోతిక చెప్పిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆందోళన చేపట్టారు.

వ్యవహారం పోలీసుల వరకు
జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా నుండి ఆ డైలాగులు తొలగించాలని కోరుతున్నారు.

గతంలోనే ఆందోళనలు
‘నాచియార్' చిత్రంపై ముందు నుండి వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక హిందులవు మనోభావాలు దెబ్బతీసే విదంగా డైలాగులు చెప్పిందని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. వివాదాస్పద డైలాగులన్నీ మ్యూట్ చేసి సినిమాను.... నిన్న(ఫిబ్రవరి 16)న విడుదల చేశారు.

ఈ డైలాగ్ తొలగించని మేకర్స్
అయితే సినిమాలొ వివాదాస్పద డైలాగులు తొలగించిన మేకర్స్ 'మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే' అనే డైలాగ్ అలాగే ఉంచడంతో ఆందోళన కారులు మరోసారి భగ్గుమన్నారు.

నాచియార్ మూవీ
‘నాచియార్' సినిమా విషయానికొస్తే.... ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో జ్యోతిక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. మరో ముఖ్య పాత్రలో జివి ప్రకాష్ కుమార్ నటించారు. నిన్న విడుదైన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











