twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ 'ఈగ'కి గౌరవం దక్కింది

    By Srikanya
    |

    చెన్నై: గోవాలో 43వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బాక్సాఫీసు దగ్గర విజయవంతమై... సాంకేతికపరమైన హంగులతో ఆశ్చర్యపరచిన 'ఈగ' సినిమా అసలు ఎంట్రీగానే వెళ్లకపోవటం అంతటా చర్చనీయాంసమైంది. వెళితే గ్యారెంటీగా ప్రసంసలు వచ్చేవని చాలా మంది అనుకోవటం జరిగింది.. ' పెద్ద చిత్రసీమ తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా లేకపోతే బాగోదు ఏదైనా మంచి చిత్రం ఉంటే చూడండి' అని న్యాయనిర్ణేతలే చొరవ తీసుకొని వెదికారు. దొరకని పరిస్థితి నెలకొని ఉంది. అయినా ఫలితం లేదని పెదని విరిచేసారు.

    అయితే ఇప్పుడు చెన్నై ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కి ఈగ చిత్రం ఎంపికైంది. తమిళంలో 'నాన్ఈ' పేరుతో రిలీజైన ఈ చిత్రాన్ని ఈ ఫెస్టివల్ కి తమిళ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈగ ..చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఎగరనుంది. ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ చిత్రాలను ప్రతీ దేశం ఈ ఫెస్టివల్ కి పంపుతుంది. దాదాపు 57 దేశాలనుంచి 160 చిత్రాలు ఈ పెస్టివల్ లో ప్రదర్సింపబడతాయి. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 13-20 వరకూ జరుగుతుంది.

    తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తమిళంలోనూ తమింళంలో 'నాన్ ఈ'టైటిల్ తో విడుదల అయ్యింది. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా హక్కులు తీసుకుని విడుదల చేసింది. అక్కడ కలెక్షన్స్ చూస్తే..దాదాపు పాతిక కోట్లు వరకూ వసూలు చేసి నిర్మాతలకు మంచి లాభం చేకూర్చిందని చెప్తున్నారు.

    సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించింది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందించారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.

    English summary
    The Tamil version of 'Eega', 'Naan Ee' is going to be a big time movie at the Chennai International Film Festival, which is going to commence in a couple of weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X