విశాల్ తెలుగోడు, తరిమికొట్టండి... పరాకాష్ఠకు చేరిన తమిళ నటుల ఎన్నికల ఫైట్!

Recommended Video

Nadigar Sangam Election 2019 : Bharathi Raja controversial comments On Vishal || Filmibeat Telugu

పదవులు దక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతారు, విద్వేషాలు రెచ్చగొడతారు అనేది ప్రజలు ఎన్నో సందర్భాల్లో కళ్లారా చూశారు. ఇలాంటి సంస్కృతి సినిమా రంగానికి కూడా అంటుకుంటోంది. తాజాగా నడిగర్ సంఘం (తమిళ సినీ నటుల సంఘం)ఎన్నికలు నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు.... భాగ్యరాజా నేతృత్వంలోని టీం బలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగ్యరాజా టీంకు మద్దతు ఇస్తున్న తమిళ దర్శకుడు భారతీ రాజా విశాల్ మీద సంచలన ఆరోపణలు చేశారు.

విశాల్ తెలుగోడు కావడంతో టార్గెట్

విశాల్ తెలుగోడు కావడంతో టార్గెట్

నడిగర్ సంఘం తమిళులు కాని వ్యక్తుల చేతుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా బాధగా ఉందని, భాగ్యరాజా నేతృత్వంలోని టీంను గెలిపించుకోవడం ద్వారా తమిళ నటుల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.

తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తాం

తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తాం

తాము గెళిస్తే నడిగర్ సంఘం(దక్షిణ భారత సినీ నటుల సంఘం) పేరు... తమిళ సినీ నటు సంఘంగా మారుస్తామని... ఇప్పుడు తెలుగు, మలయాళం పరిశ్రమలకు సపరేటుగా సంఘాలు ఉన్నాయి. పాత కాలం నాటి ఈ పేరు ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని, భాగ్యరాజా టీం గెలిస్తే దీన్ని తమిళ సినీ నటుల సంఘంగా మారుస్తామని ప్రచారం చేస్తున్నారు.

విశాల్‌ను తరిమి కొట్టాలి

విశాల్‌ను తరిమి కొట్టాలి

తమిళ సినీ నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాల్ పందికొక్కులా మారాడని, నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, విశాల్ లాంటి పందికొక్కుతో పాటు అందులోని చీడపురుగులను నిర్మాతల మండలి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు.

విశాల్ టీం కూడా అదే స్థాయిలో...

విశాల్ టీం కూడా అదే స్థాయిలో...

మరో వైపు విశాల్ అండ్ టీం కూడా ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. గతంలో పదవిలో ఉన్నవారు చేసిన అవినీతి పనులపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రిపై విశాల్ చేసిన ఆరోపణలపై హీరోయిన్ వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X