twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరెలా ఛస్తేనేం..పెద్ద హీరోల పాలసి

    By Staff
    |

    Nadigar Sangam
    ముంబయి బాంబ్ ప్రేలుళ్ళలకు ప్రపంచమంతా శ్రధ్ధాంజలి ఘటిస్తూ..సంతాపం వ్యక్తం చేస్తోంది. అయితే సామాజిక సమస్యలు తమవేనంటూ తిరిగే సినిమా హీరోలు మాత్రం ఇలాంటివి తమకు పట్టనట్లు బిహేవ్ చేస్తున్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమ అమర జవాన్ల కు జేజేలు పలికింది. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముంబై ముట్ట డి మృతులకు సంతాపం ప్రకటించింది. మంగళవారం టి.నగర్‌లోని దక్షిణ భారత చలన చిత్ర నటుల సంఘం కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమిళ సినీ పరిశ్రమ శ్రద్ధాంజలి ఘటించింది. కొవ్వొత్తులు వెలిగించి, వారి ఆత్మల కు శాంతికలగాలని ప్రార్థించింది.

    'ఉగ్రవాదం వద్దు-సోదర భావమే ముద్దు' అ ని ముక్తకంఠంతో నినదించింది. సంఘం కార్యదర్శి రాధారవి నేతృత్వంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం సాగింది. ని ర్మాతల సంఘం అధ్యక్షుడు రామనారాయణన్‌తోపాటు అనేకమంది నటీనటు లు హాజరయ్యారు.దేశంలో రోజురోజుకూ ఉగ్రవాదం పెచ్చుమీరుతున్నదని, వందలాది అమాయకులు బలవుతున్నారని తమ ప్రసంగాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై ముట్టడి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, సంఘీభావం ప్రకటించారు.

    ఇది ప్రతి పౌరుడి కర్తవ్యమని పేర్కొన్నారు.సత్యరాజ్,అర్జున్,జయం రవి,శ్రీకాంత్,ప్రసన్న,ధనుష్,వివేక్,అబ్బాస్,జీవా,శరత్ బాబు,భరత్,కార్తి,పార్ధీపన్,మురళి,శక్తి,సుకన్య,రాధిక,ముంతాజ్,లత,శ్రీ ప్రియ,దర్శకుల్లో పి.వాసు,ముక్త శ్రీనివాసన్,గుంగనాధన్ మొదలైన వారు అటెండయ్యారు. అయితే పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు పలువురు ఇందులో పాల్గొనలేదు. దాంతో కోలీవడ్ మొత్తం చిన్నా చితకా అంతా ఇదో టాపిక్ గా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు పరిశ్రమ తీరూ ఇదేగా...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X