twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏకమైన తమిళ సినీ పరిశ్రమ: ఐపీల్ మ్యాచ్‌లు బహిష్కరించాలని పిలుపు

    By Bojja Kumar
    |

    కావేరీ జల వివాదానికి సంబంధించిన ఇష్యూలో తమిళనాడుకు అక్కడి సినీ పరిశ్రమ కూడా తన మద్దతు ప్రకటించింది. తమిళనాడుకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కావేరీ మేనేజ్మెంట్ బోర్డును డిమాండ్ చేస్తూ ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాజాగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పలువురు తమిళ చిత్ర నిర్మాతలు, నటులు కావేరీ జలాల వివాదానికి మద్దతుగా చెన్నైలో జరిగే ఐపీల్ మ్యాచ్‌లను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా నిర్మాత భారతీరాజా మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ తమ తమ విబేధాలు పక్కన పెట్టి తమిళనాడుకు కావేరీ జలాల కేటాయింపు విషయంలో ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని, తమిళ ప్రజల గళాన్ని గట్టిగా వినిపించాలని కోరారు. గతంలో జల్లికట్టు, నీట్ విషయంలో యువతరం అంతా ఏకమైన విజయం సాధించారు. ఇపుడు రైతుల కోసం వారు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు న్యాయం జరుగాలనే డిమాండ్‌కు మద్దతుగా అందరూ చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను బహిష్కరించాలి అన్నారు.

    Nadigar Sangam raised voice against IPL

    తమిళనాడుకు కావేరీ జలాల కేటాయింపు విషయంలో జాతీయపార్టీలు మద్దతు ఇవ్వకపోవడంపై తమిళ సినీ నిర్మాతలు మండి పడ్డారు. తమిళనాడుకు కావేరీ జలాలు రావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీలు ఉండాలా? అలాంటపుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు? అని మండి పడ్డారు.

    ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.... నాకు ఎలాంటి పొలిటికల్ యాంబిషన్స్ లేవు. అయితే తమిళ ప్రజల సమస్యపై నా వాయిస్ వినిపించాలని నిర్ణయించుకున్నాను. ఐపీఎల్ మ్యాచ్‌లు కావేరీ జలాల సమస్యపై ప్రజల దృష్టిని పక్కకు మళ్లిస్తాయి. అందుకే వాటిని బహిష్కరిద్దాం, తమిళనాడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

    తమిళనాడుకు కావేజీ జలాల కేటాయింపుపై జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తమిళ సినీపరిశ్రమ తరుపున ఆదివారం మౌన ప్రదర్శన చేశారు. ఈ ఆందోళనలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

    కాగా, రెండు సంవత్సరాల నిషేదం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎఎల్‌లోకి ఎంటరైంది. ఏప్రిల్ 7న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించింది. చెన్నైలో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగబోతోంది.

    English summary
    Nadigar Sangam raised voice against the Indian Premier League (IPL) matches to be held in Chennai. Filmmakers Bharathiraaja, Ameer, RK Selvamani, Vetrimaaran and a few others along with actor Sathyaraj attended a press meet and gave a call to the people to boycott the upcoming IPL matches to be played in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X