For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య చిత్రానికి 'టైగర్ విశ్వ' టైటిల్ ఖరారు

  By Srikanya
  |

  నాగచైతన్య త్వరలో టైగర్ విశ్వ టైటిల్ తో అలరించనున్నాడు. అయితే ఈ టైటిల్ నాగచైతన్యకు ఇష్టం లేదట. అయినా ఆ టైటిల్ తో సినిమా రిలీజైపోతోంది. ఇంతకీ ఈ టైటిల్ ఏ చిత్రానికి అంటే...నాగచైతన్య డిజాస్టర్ చిత్రం దడ కి ఈ టైటిల్ ని పెట్టారు. దడ చిత్రాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేసి త్వరలో విడుదల చేస్తున్నారు. అందుకోసం పరవ్ ఫుల్ గా ఉంటుందని ఆ టైటిల్ పెట్టారు. ఇక అక్కడ హీరోయిన్ కాజల్, నాగచైతన్య అన్నయ్య గా చేసిన శ్రీరామ్ పాపులర్ కావటంతో ఈ సినిమాకి మినిమం ఓపినింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు. నాగచైతన్య గత చిత్రాలు జోష్ కూడా అక్కడ విడుదలైంది. అక్కడ డబ్ చేసేది కేవలం శాటిలైట్ కోసమే అంటున్నారు. త్వరలో బెజవాడ చిత్రం కూడా డబ్బింగ్ కానుందని సమాచారం.

  ఇక దడ చిత్రాన్ని శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ద్వారా అజయ్‌ భుయాన్‌ దర్శకుడుగా పరిచయం అయ్యారు. 'అమెరికా నేపథ్యంలో సాగే కథ 'దడ'. అక్కడ ఓ భారతీయ యువకుడికి ఎదురైన అనుభవాల చుట్టూ చిత్రం తిరుగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌...ఇవన్నీ సమపాళ్లలో మేళవించి చూపించారు. 'దడ'లో శ్రీరామ్‌, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌ రిషి, కెల్లీ డార్జ్‌, తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌ తదితరులు నటించారు. మాటలు: అబ్బూరి రవి, స్త్టెలింగ్‌: డి.ప్రణతిరెడ్డి, సహ నిర్మాత: విశ్వచందన్‌రెడ్డి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

  ప్రస్తుతం నాగచైతన్య ఆటో నగర్ సూర్య చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఎంత ఫేమసో... ఆటోనగర్‌ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది.

  మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఈ చిత్రం వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం అని వివరించారు. ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

  English summary
  Actor Naga Chaitanya, Srikanth, Actress Kajal Agarwal, Samiksha Singh starrer Dhada telugu film dubbed in tamil titled “Tiger Vishva”. Directed by Ajay Bhuyan and Music by Devi Sri Prasad.He will be giving a treat to Tamil tambis with his romance Kajal in US backdrop. Srikanth starred as his brother in the film for which Devisri Prasad tuned music. Chaitu indulged in stunning and daring stunts in the film in his quest for mass image.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X