Venkat Prabhu: నాగ చైతన్య దర్శకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం ఏమిటంటే?
తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన తమిళంలో తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో డబ్ అయి విడుదల అయ్యాయి. ఎవరూ ఊహించని ట్విస్టులతో క్లైమాక్స్ ప్లాన్ చేసే వెంకట్ ప్రభుకు తెలుగులోను అరకొరగా అభిమానులు ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు పేరొందిన డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాజాగా సమాచారం అందింది.
వెంకట్ ప్రభు అసలు పేరు వెంకట్ కుమార్ గంగై అమరేన్. 1975లో నవంబర్ 7న జన్మించిన ఆయన రంగస్థలం పేరు వెంకట్ ప్రభుగా అందరికీ సుపరిచితుడు అయ్యాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. 2007లో చెన్నై 600028 సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన తర్వాత వరుస క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు.

సరోజ (2008), గోవా (2010), గ్యాంబ్లర్ (2011) బిర్యాని (2013) వంటి చిత్రాలతో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. చందమా కాజల్ అగర్వాల్ తో చేసిన ఓటీటీ ప్రయోగం లైవ్ టెలీ క్యాస్ట్ ఘోరంగా విఫలమైంది. తర్వాత మన్మథ లీల మూవీతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ శింబుతో చేసిన మానాడు (2021) మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు పెద్దగా విజయం దక్కలేదు.
అక్కినేని నాగ చైతన్యతో బైలింగువల్ ప్రాజెక్ట్ గా కస్టడీ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు వెంకట్ ప్రభు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వెంకట్ ప్రభును పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన్ను చెన్నైలో అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. అయితే అందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











