నాగచైతన్య సరసన త్రిష సూటవుతుందా? కాదా?
శింబు, త్రిష నటించిన 'విన్నైతాండి వరువాయ" తమిళ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'జోష్" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో అక్కినేని నాగార్జున తన తనయుడికి ఎలాగైనా పెద్ద బ్రేక్ తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న త్రిషనే తెలుగులో నాగచైతన్య సరసన నటింపజేయాలని గౌతమ్ సంకల్పించాడట. కోలీవుడ్ నిర్మాతలు అక్కడి నాయికలకు రెమ్యూనరేషన్ ను రూ. 60 దాకా ఇస్తారట. అయితే టాలీవుడ్ నిర్మాతలు మాత్రం నాయికలకు కోటికి పైగా ఇవ్వడానికి ఈ మధ్య కాలంలో రెడీ అంటున్నారు. అందుకే కాబోలు తెలుగుకైతే తన మార్కెట్ రేటు వేరుగా ఉంటుందని త్రిష చెప్పడంతో కగ్గుతిన్నారట.
కనుక నాగచైతన్య సరసన నటించాలంటే 'కో" అని అనాల్సిందే పట్టుపడుతోందట త్రిష. మరీ అంత మంకుపట్టు బడితే గౌతమ్ మాత్రం ఏం చేస్తాడు. 60'ల" కారాలకు ఓకే చేప్తే సరి లేదంటే హాటెస్ట నటీమణి సమంతను తీసుకుంటానని ముఖం మీద చెప్పేశాడట. అయినా కింగ్ సినిమాలో నాగార్జున తో కలిసి నటించిన త్రిష మరి ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్య సరసన త్రిష సూటవుతుందా? ఏమంటారు? ఒక వేళ ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ వర్కవుట్ కాదనిపిస్తే ఆమో స్థానంలో తమిళ కథానాయిక 'సమంత" ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











