స్టార్ హీరో 50వ చిత్రంలో నాగార్జన గెస్ట్!!

By Srikanya

నాగార్జున త్వరలో ఓ తమిళ చిత్రంలో గెస్ట్ గా కనిపించనున్నారు. అజిత్ 50 వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు రూపొందించనున్నారు. వెంకట్ ప్రభు గతంలో గోవా,సరోజ తదిదర చిత్రాలు రూపొందించారు. ఇక ఈ చిత్రం ఓ గమ్మత్తైన యాక్షన్ కామిడీగా రెగ్యులర్ చిత్రాలుకు డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంగత్త అనే టైటిల్ తో తయారయ్యే ఈ చిత్రం కోసం నాగార్జునని ఓ కీలకమైన రోల్ కి అడిగారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని దయానిధి అజగిరి తమ క్లౌడ్ నైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. యవన్ శంకర్ రాజా సంగీతం అందించే ఈ చిత్రానికి కెమెరా శక్తి శరవణ్ అందిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున మరో తమిళ దర్శకుడు రాధా మోహన్ దర్శకత్వంలో గగనం అనే చిత్రంలో చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X