విలన్‌గా నాగార్జున అక్కినేని.. తొలిసారి సూపర్ స్టార్‌ ఢీకొట్టే పాత్రలో మన్మథుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కూలీ. రజనీ కెరీర్‌లో 171వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా.. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ కూలీగా నటిస్తుండగా ఆర్ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు అనే విషయం టీజర్‌లో స్పష్టమైంది. కాకపోతే రజనీ మాస్ అవతారం.. ఆయన పాత్ర చుట్టూ అల్లిన కామెడీ చూస్తే.. థియేటర్‌లో మాస్ ప్రేక్షకులకు పండుగే అనేది చెప్పకనే చెప్పారు.

Nagarjuna Akkineni to play Villain role in Lokesh Kangaraj and Rajinikanth s Coolie

కూలీ చిత్రంలో రజనీకాంత్ వింటేజ్ లుక్‌ క్రేజీగా మారింది. ఆయ నటించిన సినిమాలో ఓ డిస్కో పాటను క్రేజీగా మళ్లీ రీ డిజైన్ చేయడం అభిమానులను ఉర్రూతలూగించింది. ఇదంతా రజనీ చరిష్మా పక్కన పెడితే.. ఈ సినిమాలో మరో విశేషం చర్చనీయాంశమైంది.

కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారనేది తాజా వార్త. రజనీకాంత్‌తో పోటీపడి ఎదురించే పాత్రను చేయడానికి ఆయన ఒప్పేసుకొన్నారు. లోకేష్ కనకరాజ్ సినిమా ద్వారా ఇప్పటి వరకు హీరోగా కనిపించిన ఆయన తన కెరీర్‌లో విలన్ పాత్రను చేయడానికి సిద్దపడ్డారంటే.. ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Nagarjuna Akkineni to play Villain role in Lokesh Kangaraj and Rajinikanth s Coolie

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగంలో హీరోగాను, స్పెషల్ రోల్‌లో నాగార్జున కనిపించారు. తొలిసారి ఓ సూపర్ స్టార్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారనే వార్త అటు అభిమానుల్లోను, ఇటు ప్రేక్షకుల్లోను క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X