నాగార్జున పాత చిత్రాలకు ఊపొచ్చింది
హిట్టు, ప్లాఫ్ అనే సంభందం లేకుండా నాగార్జున చిత్రాలను కొని డబ్బింగ్ చేసుకోవటానికి తమళ నిర్మాతలు ఆరాటపడుతున్నారు. దానికి కారణం త్వరలో నాగార్జున హీరోగా రెడీ అవుతున్న "పయనం" చిత్రం. తమిళ దర్శకుడు రాధామోహన్ (ఆకాశమంతా ఫేమ్) రూపొందిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఆ చిత్రం రిలీజ్ టైమ్ లో మరిన్ని నాగార్జున చిత్రాలను మార్కెట్లో కుమ్మించి లబ్ది పొందాలని కొందరు చిన్న నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమలోనే నాగార్జున “డాన్" సినిమాని త్వరలో డబ్ చేసి తమిళ్ లో విడుదల చేయనున్నారు. నాగ్ తో పాటు లారెన్స్, అనుష్క లు కూడా తమిళనాడులో పాపులరే కాబట్టి, “డాన్" అక్కడి ప్రేక్షకులని అలరిస్తుందని ఆ చిత్రం డబ్బింగ్ హక్కులను కొనుక్కున్న నిర్మాతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక “పయనం" చిత్రానికి తెలుగు నిర్మాత దిల్ రాజు అయితే తమిళ నిర్మాత ప్రకాష్ రాజ్. నాగార్జున ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూంటే, ప్రకాష్ రాజ్ టెర్రరిస్ట్ గా కనపడనున్నారు.


Click it and Unblock the Notifications











