నాగార్జున బై చెప్పిన పాత్రలోకి 'యాక్షన్ కింగ్' అర్జున్
ఆ మధ్యన నాగార్జున తమిళంలో అజిత్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించటానికి కమిటయ్యాడనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా పాత్రను తాను చేయటం లేదని, వేరే వాళ్ళని చూసుకోమని నాగార్జున తేల్చి చెప్పటంతో ఆ ప్లేస్ లోకియాక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న అర్జున్ వచ్చి చేరారు. మంకత అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం అజిత్ కి యాభై వ చిత్రం. చాలా ప్రతిష్టాత్మకంగా భావించి దర్శకుడు వెంకట ప్రభుకి డైరక్షన్ అప్పగించారు. దాంతో అతను నాగార్జునని ఒప్పించి తెలుగులో నాగార్జున హీరోగా, అజిత్ గెస్ట్ గా, తమిళంలో అజిత్ హీరోగా ,నాగార్జున గెస్ట్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మధ్యలో ఏమైందో ఏమో గానీ నాగార్జున ఆ పాత్రకి బై చెప్పేసారు. దానికి కారణం అజిత్..తెలుగు వెర్షన్ వేరేగా వద్దని, తను హీరోగా చేసిన తమిళ వెర్షన్ నే తెలుగులోనూ విడుదల చేయాలని కండీషన్ పెట్టడంతో ఈ మార్పు జరిగిందని తమిళ తంబీలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున తాజా చిత్రాలు రగడ, గగనం విడుదలకు రెడీగా ఉన్నాయి. అలాగే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఢమురుకం అనే చిత్రం కూడా కమిటయ్యారు. అలాగే రాజమౌళి తండ్రి దర్సకత్వంలో తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంలో రాజన్న అనే చిత్రం కూడా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











