పాపులర్ తెలుగు, తమిళ్ సాంగ్ లో చిందేయనున్న డర్టీ హీరోయిన్
డర్టీ పిక్చర్ సినిమాలో విషయమేంత ఉంటుందో తెలియదు గాని పబ్లిసిటీ విషయంలో ఈ సినిమా నిర్మాతలు తలపండిపోయిన మేధావిని మించిన విధంగా చేస్తున్నారు. వీరి పబ్లిసిటీ హడావుడికి సినిమా మొదటి రోజునే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో కూడా హిందీతో పాటే రిలీజ్ అవుతుంది. స్ట్రయిట్ తెలుగు తమిళ్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు విద్యాబాలన్ డర్టీ పిక్చర్ కు వచ్చేసింది. సినిమా వచ్చేందే తడువుగా చూసేయాలన్నంత ఉత్సాహంతో ఉన్నారు తమిళ్ తంబీలు. ఈ సినిమాలో సౌత్ సినిమాకు చెందిన హీరోలే పాత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. 80,90 లలో సిల్క్ స్మితతో సన్నిహితంగా సాగిన హీరోలేవరో కూడా ఈ సినిమాతో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీతో పాటు తమిళ్ , తెలుగులో ఈ సినిమా పై అంచనాలు పెంచేందుకు ఓ సౌత్ పాపులర్ పాటను కూడా పెట్టారు.
ఎనభైయ్యవ దశకంలో నిషా ఎక్కించే మత్తు కళ్లతో యువ హృదయాలను కొల్లగొట్టిన భామ సిల్క్‌స్మిత. ఈ భామ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'డర్టీపిక్చర్". ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో తమిళంలో పాపులర్ అయినటువంటి 'నాకు ముక నాకు ముక..." అనే తమిళపాటని ఎటువంటి మార్పులు లేకుండా విద్యాబాలన్‌పై దర్శకుడు మిలన్ లుథ్రియా చిత్రీకరించాడు. ఈ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సినీ నటిగా నటించిన విద్యాబాలన్ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేసిందని విమర్శలోస్తున్నాయి.
ఈ మధ్య విడుదలైన 'డర్టీపిక్చర్" ప్రచార చిత్రాల్లో విద్యాబాలన్ మరింత సెక్సీగా కనిపించడంతో ఆ విమర్శలు మరింత పెరిగాయి. దీని గురించి విద్యాబాలన్ విమరణనిస్తూ ''సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్‌కు హద్దులు నిర్ణయించడం కష్టం. పాత్ర లేదా చిత్రాన్ని బట్టి గ్లామర్‌గా కనిపించక తప్పదు. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే 'డర్టీపిక్చర్"లో నా పాత్ర గ్లామర్‌ను పండిచాలి. ఎంత వరకు గ్లామర్‌గా కనిపించాలో అంత వరకే నటించాను. కానీ అంతా అంటున్నట్టుగా ఎక్కడా హద్దుదాటి ఎక్సపోజింగ్ చేయలేదు" అంటోంది.


Click it and Unblock the Notifications











