ఫొటో దిగి...సమీరా రెడ్డి ఇరుక్కుపోయింది(ఫొటో)
చెన్నై : అందాల తార సమీరారెడ్డిపై తమిళ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలో తమిళుల వూచకోత అంశం.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కుమారుడు నమల్ రాజపక్సతో.. సమీరారెడ్డి అన్యోన్యంగా ఉన్న ఫొటోలు తమిళుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
అంతర్జాలంలో ఈ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళంలో 'వెడి', 'వారనం ఆయిరం', 'వేట్టె'.. తదితర చిత్రాల్లో నటించింది సమీరారెడ్డి. నమల్‌తో ఉన్న ఫొటోలు ఆమె కెరీర్‌ను దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీలంకకు చెందిన వ్యక్తి సినిమాను నిర్మిస్తున్నారనే నెపంతో 'కత్తి'కి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు 'పులిపార్వై' కూడా కష్టాలతో ఎదురీదుతోంది. మరి సమీరా పరిస్థితి ఏమవుతోందో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











