నమితకు ఓ దర్శకుడి నయవంచన
బాగా లావెక్కిపోయి మరో షకీలాలాగా మారిన నమిత ఈ మధ్య గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. ఆమెకు నటుడు, దర్శకుడు పార్దీవన్ ఆమెకు తన తాజా సినిమా పచా కుదిరలో ఒక మంచి పాత్రను ఆఫర్ చేశారు. ఎక్స్‌పోజింగ్‌తో విసిగిపోయిన నమితకు ఆ ఆఫర్ అమితానందం కలిగించింది. ఆ సినిమాలో ఆమె మేకప్ కూడా లేకుండా నటించవలసి వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక మురికివాడ నివాసి. ఆమె ఒక వీధి రౌడీని పెళ్ళి చేసుకుంటుంది. ఈ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వస్తుందని, పెద్ద అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదని నమిత నమ్మింది. కానీ సినిమా విడుదలయ్యాక ఆమెకు అసలు సత్యం బోధపడింది. పార్దీవన్ తనను మేకప్ లేకుండా పచ్చిగా చూపించాడని. మొహానికి ఒంటికి రంగు వేసుకున్న దానికంటే ఆ సన్నివేశాలు మరింత అశ్లీలంగా ఉన్నాయని. ఆ సినిమాలో నటనకు నమితకు ఏ అవార్డు వస్తుంది? ఆ రకం అవార్డులు మనకు లేవే!


Click it and Unblock the Notifications