నమిత వలలో రాజా

ఇక ఈ సినిమాలో రాజా అప్పటి నరసింహరాజు పోషించిన యువరాజు పాత్ర లో కనిపిస్తారు. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో కథలో యువరాజు తనను మాయచేసిన జగన్మోహిని వలలో పడిపోతాడు. ఆ అందాల భామ అంగాంగ ప్రదర్శనకు మంత్రముగ్ధుడైన హీరో.. ఆమె కొంగుపట్టుకుని తిరుగుతూంటాడు. అప్పుడు ఆమె భార్య ఎలా తన భర్తని ఆమె నుండి రక్షించుకుందనేదే ఈ కథలో ఆసక్తికర అంశం.తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నఈ జానపద చిత్రానికి నిర్మాత హెచ్.మురళి . అటు తమిళం, ఇటు తెలుగు చిత్రసీమల్లో తన అందచందాలతో కుర్రకారు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తున్న నమిత.. ఈ చిత్రంలో తన అందాలను విస్తారంగానే ఆరబోసినట్టు సమాచారం. ఇక మరో కథానాయికగా మీరాచోప్రా కనిపించి అలరించనుంది.


Click it and Unblock the Notifications











